తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అడవి కాల్చేయమని డబ్బులిచ్చిన ప్రముఖ హీరో!'

ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాధార మహా అరణ్యాలు అమెజాన్​. ఇటీవల కాలంలో ఇవి అగ్నికి ఆహుతైపోతుంటే ప్రముఖులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనకు ఓ స్టార్​ హీరో కారణమని ఆరోపించారు బ్రెజిల్​ అధ్యక్షుడు జెయిర్​ బొల్సొనారో.

brazils-president-blames-hollywood-star-hero-for-amazon-forest-fires
అడవి కాల్చేయమని డబ్బులిచ్చిన ప్రముఖ హీరో...!

By

Published : Dec 1, 2019, 12:46 PM IST

Updated : Dec 1, 2019, 1:08 PM IST

అమెజాన్​ అడవులను మంటల్లో కాలుస్తున్న కొన్ని సేవా సంస్థ (ఎన్జీవో)లకు ప్రముఖ హాలీవుడ్​ నటుడు, ఆస్కార్​ అవార్డు గ్రహీత లియోనార్డో డికాప్రియో ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు ​బొల్సొనారో.

"లియోనార్డో మంచి వ్యక్తా..? అమెజాన్​ తగలబెట్టడానికి డబ్బును దానం చేశాడు" అని బ్రెజిల్​లోని ప్రెసిడెన్షియల్​ ప్యాలెస్​ వద్దకు వచ్చిన మద్దతుదారులతో ఈ మాటలు చెప్పారు జెయిర్​ బొల్సొనారో.

డికాప్రియో, బొల్సొనారో

ఆరోపణలపై హీరో స్పందన...

బ్రెజిల్​ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించాడు డికాప్రియో. " అమెజాన్​ అడవుల పరిరక్షణకు బ్రెజిల్​ ప్రజలతో కలిసి నేనూ ముందుంటాను" అని తెలిపాడు. ఏ సంస్థలకూ నేను ఆర్థిక సహాయం చేయట్లేదని చెప్పిన స్టార్​ హీరో.. బ్రెజిల్​లోని స్థానిక ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజలు, విద్యావేత్తలు, వివిధ కమ్యూనిటీ ప్రజలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నాడు.

గతంలోనూ అమెజాన్​ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బొల్సొనారో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్​లో జరిగిన జీ7 సమ్మిట్​లో అమెజాన్​ అడవుల రక్షణ కోసం 20 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం వచ్చినా దాన్ని తీసుకునేందుకు ఆయన తిరస్కరించారు.

Last Updated : Dec 1, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details