తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​లో క్రేజీ కాంబోలు.. హిట్​ దక్కేనా? - షారుక్​ ఖాన్ పఠాన్

బాలీవుడ్​లో క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికి వరకు చిత్రాలు రాని కొత్త కలయికల్లో ప్రాజెక్టుల ప్రకటనలు వచ్చాయి. 2021లో అలా తొలిసారి కలిసి పనిచేస్తున్న దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా?

Brand new actor-director combos strive to strike gold at the box office
బాలీవుడ్​లో క్రేజీ కాంబోలు.. హిట్​ దక్కేనా?

By

Published : Jan 21, 2021, 8:23 AM IST

సినిమా బాగా పండాలంటే కథ బాగుండాలి. దర్శకుడు కథానాయకుడి మధ్య కెమిస్ట్రీ కుదరాలి. అలా కుదిరి ఓ సినిమా హిట్ అయితే ఆ కలయికలో సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాగని వారి చిత్రాలే హిట్ కావడం లేదు. క్రేజీ డైరెక్టర్, స్టార్ యాక్టర్ కలయికలో వస్తున్న కొత్త సినిమాలూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అలాంటి కొత్త కాంబినేషన్లు ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయి. 2021లో తొలిసారి కలిసి పనిచేస్తున్న దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఎలాంటి చిత్రాలతో అలరించనున్నారో చూద్దాం.

సిద్ధార్థ్​ ఆనంద్, దీపికా పదుకొణె, షారుక్​ ఖాన్
  • 'వార్' చిత్రంతో 2019లో భారీ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు షారుక్​ ఖాన్​తో 'పఠాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కథల్ని తెరకెక్కించడంలో పేరున్న సిద్ధార్థ్​ ఈ చిత్రాన్ని షారుక్​ అభిమానుల్ని అలరించేలా తీర్చి దిద్దే పనిలో ఉన్నారట. పైగా 'జీరో' తర్వాత షారుక్​ నుంచి సినిమా రాలేదు. 'జీరో' ప్లాప్ అయింది. దాంతో 'పఠాన్'పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
    అక్షయ్​ కుమార్​
    సారా అలీఖాన్
  • ప్రముఖ దర్శకనిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వీరిద్దరు కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'అత్రాంగీ రే'. ఈ చిత్రంలో అక్షయ్​తో పాటు ధనుష్, సారా అలీఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది.
    విక్కీ కౌశల్​
  • 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'తో స్టార్ హీరోగా ఎదిగిన విక్కీ కౌశల్ ఏడాది ఇద్దరు క్రేజీ దర్శకులతో తొలిసారి పనిచేయబోతున్నారు. సూజిత్ సర్కార్​తో 'సర్దార్ ఉదమ్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఓ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు విక్కీ.
    సంజయ్​ లీలా భన్సాలీ, ఆలియా భట్​
  • 'కపూర్ అండ్ సన్స్' లాంటి భారీ హిట్ అందించిన శకున్ బత్రా దర్శకత్వంలో నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. మరో బాలీవుడ్ యువ కథానాయిక ఆలియా భట్ ఈ ఏడాది తొలిసారి ఇద్దరు స్టార్ దర్శకులతో పని చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీతో 'గంగూబాయి కతియా వాడి' చిత్రంలో వేశ్యగా నటిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్ర పోషిస్తున్నారు. ఆలియా, పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
    ఆలియా భట్​, రాజమౌళి
    'యానిమల్​' సినిమాలో పరిణితీ చోప్రా, రణ్​బీర్​ కపూర్​
  • కబీర్ సింగ్'తో బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో యువ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్​ తొలిసారి నటిస్తున్న చిత్రం 'యానిమల్'.
    ఆయుష్మాన్ ఖురానా
  • 'కేదార్‌నాథ్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అభిషేక్ కపూర్​తో కలిసి తొలిసారి పనిచేస్తున్నారు యువ హీరో ఆయుష్మాన్ ఖురానా. వీరిద్దరి కలయికలో రానున్న చిత్రం 'ఛండీగడ్ కరే ఆషికీ'.

క్రేజీ కాంబినేషన్లే కావాలి

"ప్రేక్షకలు ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. కథే కాదు హీరో, డైరక్టర్, హీరో హీరోయిన్లు ఇలా అన్నీ క్రేజీ కాంబినేషన్లు ఉండాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే పలు చిత్రాలు తెరకెక్కడం ఆనందించడగ్గ విషయం" అని అంటున్నారు నిర్మాత ఆనంద్​ పండిట్​.

"ఇప్పటి వరకూ కలిసి పనిచేయని దర్శకులు హీరోలు కలిసి ఓ చిత్రం చేస్తున్నారంటే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలుంటాయి. పైగా హీరోలోని సరికొత్త కోణాన్ని బయటకు తీసి తెరపై చూపించే వీలు కలుగుతుంది" అని మరో ప్రముఖ నిర్మాత అంటున్నారు.

ఇదీ చూడండి:ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'బెల్​ బాటమ్​'!

ABOUT THE AUTHOR

...view details