తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోటి మంది సాక్షిగా 'బ్రహ్మస్త' లోగో మేకింగ్​

ఆకాశంలో డ్రోన్లు రంగు రంగుల పెయింట్​లా మారితే.. అదీ ఓ సినిమా చిత్రీకరణ కోసం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు కుంభమేళానే ఒక వేదికగా చేసుకుంటే.. మూడు నెలల ప్రణాళిక.. దేశంలో తొలిసారి విభిన్నమైన మేకింగ్.. వెరసి 150 డ్రోన్లతో జరిగిన బ్రహ్మస్త్ర లోగో ఆవిష్కరణ ఓ అద్భుతం.

కోటి మంది సాక్షిగా 'బ్రహ్మస్త'లోగో మేకింగ్​

By

Published : Apr 5, 2019, 3:45 PM IST

"బ్రహ్మస్త్ర లోగో ఆవిష్కరణ ఓ సాంకేతిక ప్రయోగం. వాతావరణం, గాలి వీచే వేగాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలి. జీపీఎస్​ ఉపయోగించి డ్రోన్లను ఒక పద్ధతిలో గాలిలోనే అమర్చాం" అంటూ ఆ బ్రహ్మస్త్ర కోసం పడిన కష్టాన్ని కళ్లకు కట్టేలా చూపించేందుకు... ఓ చిన్నపాటి వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

డ్రన్లతో అయాన్​, అలియా, రణ్​బీర్​
  • మార్చి 4, 2019 ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమం.. కోటి మంది భక్తులు వచ్చిన కుంభమేళాలో బ్రహ్మస్త్ర లోగో ఆవిష్కరించారు.

బ్రహ్మస్త్ర సినిమాను 150 కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా.. అమితాబ్​, రణ్​బీర్​, ఆలియా, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్​ వంటి భారీ తారాగణంతో నిర్మిస్తున్నారు. 2019 క్రిస్ట్​మస్​ కానుకగా తొలి భాగాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి అయాన్​ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details