తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగ్ వాయిస్​తో తెలుగు 'బ్రహ్మాస్త్ర'​ - alia bhat

బాలీవుడ్​ చిత్రం బ్రహ్మాస్త్రను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత కరణ్‌ జోహర్‌. ఈ సినిమా లోగోను బాహుబలి దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు.

నాగ్ వాయిస్​తో తెలుగు 'బ్రహ్మస్త్ర'​

By

Published : Mar 11, 2019, 8:30 PM IST

బాలీవుడ్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘బహ్మాస్త్ర’. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, 'నాగిని' ఫేం మౌనీ రాయ్‌, ఆలియా భట్​ నటిస్తున్నారు.

  1. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల చేయనున్నారు. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్​తో సినిమా రూపుదిద్దుకుంటోంది.
  2. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు విడుదలైన తెలుగు ప్రోమోలో నాగ్​ వాయిస్​ ఆకట్టుకుంటోంది. 2003లో వచ్చిన ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ సినిమా తర్వాత నాగ్ బాలీవుడ్​లో కనిపించలేదు. గతంలో ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్ చిత్రాల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details