తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్య'బ్రహ్మా'కు సినీప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ - బ్రహ్మానందంకు సినీప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్​లో లెక్కలేనన్ని సినిమాల్లో హాస్యనటుడి పాత్రలు పోషించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు నటుడు బ్రహ్మానందం. అలా ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

brahmanandam birthday wishes from tollywood celebrities
హాస్య'బ్రహ్మా'కు సినీప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

By

Published : Feb 1, 2021, 5:34 PM IST

నవ్వుకు పర్యాయపదం ఆయన.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వేదిక ఏదైనా ఆయన ప్రస్తావన(ఎమోజీ, మీమ్స్‌) లేకుండా సంభాషణ సాగదేమో. తెలుగు సినిమాలో హాస్యనటుడిగా లెక్కకు మించిన పాత్రలు చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు.. నవ్విస్తూనే ఉన్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 1) హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు. నేటితో 66వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయనకు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

"మా ప్రియమైన బ్రహ్మానందంగారికి జన్మదిన శుభాకాంక్షలు"

- అల్లుఅర్జున్​, కథానాయకుడు

"నవ్వుల రారాజుకు జన్మదిన శుభాకాంక్షలు"

- రామ్‌చరణ్‌, కథానాయకుడు

"సెట్లో నవ్వులూ పూయిస్తూ మమ్మల్ని నవ్వించే బ్రహ్మానందంగారికి జన్మదిన శుభాకాంక్షలు."

- రవితేజ, కథానాయకుడు

"కింగ్‌ ఆఫ్‌ కామెడీ, గాడ్‌ ఆఫ్‌ మీమ్స్‌"-నాగబాబు, నటుడు, నిర్మాత

"బ్రహ్మానందం.. ఎలాంటి వివాదాలకు తావివ్వని హాస్యనటుడు. ఆయనకు నేను పెద్ద అభిమానినని."

- సత్యదేవ్‌, నటుడు

"ఎవర్‌గ్రీన్‌ కామెడీ కింగ్‌ బ్రాహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు"

- వరుణ్‌తేజ్‌, కథానాయకుడు

"నవ్వుతూ.. నవ్విస్తూ.. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి బాబాయ్‌.. జన్మదిన శుభాకాంక్షలు"

- హరీశ్‌శంకర్, దర్శకుడు

యువ నటుడు సుశాంత్‌.. బ్రహ్మానందంతో కలిసి చేసిన ఓ సన్నివేశాన్ని పంచుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

"మా నవ్వుల దేవుడికి జన్మదిన శుభాకాంక్షలు.. ఎక్కడైనా మీ ప్రస్తావన లేకుండా సంభాషణ అసాధ్యం" అంటూ మరో హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ తన ఫొటో గ్యాలరీలో ఉన్న బ్రాహ్మానందం ఫొటోలను పంచుకున్నారు.

ఇదీ చూడండి:హాస్య'బ్రహ్మా'.. నీ నవ్వుకు సలామ్

ABOUT THE AUTHOR

...view details