నటుడు బ్రహ్మాజీ ట్విటర్ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో ఆయన అకౌంట్ కోసం వెతుకుతుంటే ఆ పేరుతో ఖాతా లేనట్లు చూపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తన ఇంట్లోకి వరదనీరు చేరిందని పేర్కొంటూ ఇటీవల ఆయన ట్వీట్ చేశారు.
వర్షాలపై ట్వీట్.. ట్విట్టర్ నుంచి బ్రహ్మాజీ ఔట్! - ACTOR brahmaji NEWS
హైదరాబాద్ వర్షాలపై తాను చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీయడం వల్ల నటుడు బ్రహ్మాజీ.. ట్విట్టర్ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
బ్రహ్మాజీ
'మోటర్ బోట్ కొనాలనుకుంటున్నాను. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి' అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్.. పలు విమర్శలకు దారి తీసింది. వర్షాల కారణంగా అందరూ ఇబ్బందులు పడుతుంటే వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తారా? అని పేర్కొంటూ ఆయనపై వరుస నెటిజన్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన.. తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు భావిస్తున్నారు. 2011లో ట్విట్టర్‌లో చేరారు బ్రహ్మాజీ.
Last Updated : Oct 21, 2020, 2:52 PM IST