తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య పుట్టినరోజు సర్‌ప్రైజ్‌ అదేనా..? - boyapati team surprise to balayya fans on his birthday..!

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

boyapati
బాలయ్య

By

Published : Dec 16, 2019, 6:33 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజుకి చాలా సమయం ఉంది కదా! అప్పుడే సర్‌ప్రైజ్‌ ఏంటి అనుకుంటున్నారా? బాలయ్య కథానాయకుడుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న మూడో చిత్రమిది. అందువల్ల అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టిన రోజున విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

బాలకృష్ణ 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఈ హీరో పుట్టిన రోజున సినిమాలు విడుదల కాలేదు. 2020లో బాలయ్య అభిమానులకు ఆ బహుమతి అందించనున్నాడట బోయపాటి. మరి అదే రోజు విడుదల చేస్తారా, లేదా? తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుందీ చిత్రం.

ఇవీ చూడండి.. నెహ్రూ కుటుంబంపై వివాదాస్పద ట్వీట్​.. నటి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details