ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ఆయన లేరని చెప్పడానికి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంగీతం ఉన్నంత కాలం శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని చెప్పారు.
"బాలు గారి రూపం దేవుడు తీసుకుపోయినా శబ్దం శాశ్వతం. దాన్నెవరూ తీసుకుపోలేరు. ఆయన పాటలతోనే కాదు మాటలతో ఎంతో మందికి ప్రేరణ కల్గించిన గొప్ప వ్యక్తి. అలాంటిది ఈ రోజు ఆయన లేరు అనడానికి మనసు రావడం లేదు. ఇది చాలా బాధాకరం."