సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు నవీన్ చంద్ర. 'అందాల రాక్షసి', 'నేను లోకల్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. అనేక సినిమాల్లో హీరోగా కనువిందు చేశాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత' మూవీలో తన నటనతో ప్రంశసలు అందుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడని సమాచారం.
బోయపాటి చిత్రంలో విలన్గా ప్రముఖ నటుడు? - naveen playing negative role in balakrishna movie
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
![బోయపాటి చిత్రంలో విలన్గా ప్రముఖ నటుడు? Boyapati signs a super talented actor for his BB3?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7637510-579-7637510-1592296189940.jpg)
బోయపాటి చిత్రంలో విలన్గా ప్రముఖ నటుడు?
ఈ సినిమాలో నవీన్ పూర్తిగా విలన్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదీ చూడండి:మాస్ సినిమాల ఘనాపాటి.. బోయపాటి