కరోనా సమయంలో సేవాకార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సినీ నటుడు సోనూసూద్‌ను సినిమాలో హీరో కొడుతుండటంతో తట్టుకోలేక ఏడేళ్ల బాలుడు టీవీని పగలగొట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చడపంగు గురవయ్య, పుష్పలత తమ కుమారుడు విరాట్‌తో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబ సభ్యులందరు కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. టీవీలో దూకుడు సినిమా చూస్తూ అందులో హీరో మహేశ్ బాబు విలన్ సోనూసూద్‌ను కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలను చేస్తూ పేదలను ఆదుకుంటున్న సోనూసూద్ అంకుల్‌నే కొడతావా అని కోపంతో ఊగిపోయిన విరాట్ రాయి తీసుకొని టీవీని పగలగొట్టాడు. ఇది వైరల్ అయి సోనూసూద్ వరకు చేరింది. దీనిపై స్పందించిన ఆయన.. అలా టీవీలు పగలగొట్టొద్దని సూచించారు. వాళ్ల నాన్న 'మళ్లీ నన్నే కొనమంటారని' చమత్కరించారు.
SONUSOOD: సోనూసూద్‌ను ఆ సినిమాలో హీరో కొట్టాడని.. టీవీ పగలగొట్టాడు.. - telangana varthalu
కొవిడ్ సమయంలో తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా మారిన సోనూసూద్‌పై చాలా మంది ఎంతో అభిమానం పెంచుకున్నారు. కానీ ఓ బుడ్డోడి అభిమానానికి అంతులేకుండా పోయింది. ఎంతలా అంటే... సినిమాలో హీరో విలన్ పాత్రలో ఉన్న సోనూసూద్‌ను కొడుతుంటే.. తట్టుకోలేక టీవీ పగలగొట్టేంతలా. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ గ్రామంలో జరిగింది.
SONUSOOD: సోనూసూద్‌ను హీరో కొట్టాడని.. టీవీ పగలగొట్టాడు..
టీవీని పగలగొడుతున్న సమయంలో బాలుడి కోపాన్ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. టీవీ ఎందుకు పగులగొట్టావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సోనూసూద్‌ను కొట్టినందుకు కోపమొచ్చిందని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చదవండి: Scholarship : తెలుగు విద్యార్థినికి రూ.2 కోట్ల స్కాలర్‌షిప్
Last Updated : Jul 14, 2021, 2:01 PM IST