హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్..'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ పోరీలుగా పేరు తెచ్చుకున్నారు.ఆ చిత్రంలో వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో సందడి చేయబోతున్నారని టాక్. ఓ మెగాహీరో పక్కన అలరించనున్నారట.
మెగాహీరో వరుణ్‌తేజ్‌తో 'ఇస్మార్ట్' భామలు? - Varun Tej NEW CINEMA
మెగాహీరో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా కనిపించనున్న సినిమాలో నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది.

నిధి అగర్వాల్-వరుణ్‌తేజ్-నభా నటేశ్
కథానాయకుడు వరుణ్‌తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్ కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కియారానుతొలుత హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టును వదులుకుంది. ఇప్పుడామె స్థానంలో నిధి అగర్వాల్ ఎంపికైందని సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రకు నభా నటేశ్ పేరును చిత్రబృందం పరిశీలిస్తోంది. ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది చదవండి: బాక్సర్‌గా వరుణ్‌తేజ్.. మరో ప్రయోగానికి సిద్ధం
Last Updated : Nov 27, 2019, 7:55 AM IST