తెలంగాణ

telangana

ETV Bharat / sitara

13 ఏళ్ల తర్వాత 'బొమ్మరిల్లు' రీమేక్​కు మోక్షం - అనీజ్​ బజ్మీ సినిమాలు

'వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ' అంటూ... 2006లో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సినిమా బొమ్మరిల్లు. 'ఇట్స్​ మై లైఫ్​' పేరుతో దీనిని హిందీలో రీమేక్​ చేశారు. కానీ, ఇన్నాళ్లుగా రిలీజ్​కు నోచుకోలేక పోయింది. బుల్లితెర వేదికగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రానుంది.

boni kapoor its mylife movie is going to be release in small screens in november
బుల్లితెర వేదికగా 'ఇట్స్ మై లైఫ్'​ విడుదల

By

Published : Nov 5, 2020, 2:22 PM IST

'బొమ్మరిల్లు' హిందీ రీమేక్​ 'ఇట్స్ మై లైఫ్​'కు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2007లో తీసిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు​ నవంబరు 29న నేరుగా టీవీల్లో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ ట్వీట్ చేశారు. ఇందులో హర్మన్ బవేజా, జెనీలియా జంటగా నటించారు. అనీష్ బజ్మీ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్​, సోదరుడు సంజయ్​ కపూర్​తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

'ఇట్స్​ మై లైఫ్'​ సరదా, సమకాలీన భావోద్వేగ ప్రధానమైన అంశాలతో తండ్రీ, కుమారుల అనుబంధం నేపథ్యంలో నడుస్తుందని సంజయ్​ కపూర్​ అన్నారు. టీవీ విడుదల ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా.. అందర్నీ అలరిస్తుందని దర్శకుడు బజ్మీ ధీమా వ్యక్తం చేశారు. తెలుగులో ప్రకాశ్ రాజ్​ పోషించిన తండ్రి పాత్రను హిందీలో నానా పాటేకర్​ చేశారు.

ఇదీ చూడండి:బాహుబలి సినిమా ఈ శుక్రవారమే విడుదల!

ABOUT THE AUTHOR

...view details