ఇంట్లో పనిచేసిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల.. నిర్మాత బోనీ కపూర్ సహా ఆయన కుమార్తెలు జాన్వి, ఖుషి 14 రోజులు హోం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలన్నీ నెగిటివ్ వచ్చినట్లు బోనీ ట్వీట్ చేశారు. అందరి ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు.
"నాకు, నా ఇద్దరు కుమార్తెలతోపాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పడం సంతోషంగా ఉంది. మా 14 రోజుల క్వారంటైన్ కాలం ముగిసింది. ఫ్రెష్‌గా ముందుకు సాగబోతున్నాం. కొవిడ్ బారినపడ్డ వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మిగిలిన వారంతా సురక్షితంగా ఉండండి. ప్రభుత్వ సూచనల్ని పాటించండి. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యుల తరఫున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కలిసికట్టుగా మనం కరోనాను ఎదుర్కోవచ్చు"