తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2019, 6:25 PM IST

ETV Bharat / sitara

'జేమ్స్​బాండ్​గా ఎప్పుడూ.. పురుషుడే ఉండాలి'

జేమ్స్​బాండ్​ పాత్రను పురుష నటుడే చేయాలని తాను అనుకుంటున్నానని బాండ్ 25వ చిత్ర నిర్మాత బార్బరా బ్రకోలి తెలిపారు. పురుషుడి పాత్రను మహిళా నటులకు మార్చడాన్ని తాను అంగీకరించనని ఆమె చెప్పారు.

బాండ్

జేమ్స్​బాండ్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడైన ఊహించారా... ఈ పాత్రను మహిళా నటి పోషిస్తే ఎలా ఉంటుందో. కానీ అది సాధ్యపడదంటున్నారు బాండ్​ సిరీస్​లో 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న బార్బరా బ్రకోలి. ఆ పాత్ర పురుషుడే చేయాలని తాను అనుకుంటున్నానని ఆమె తెలిపారు.

"జేమ్స్​ బాండ్ పాత్రను పురుషుడే చేయాలని నేను అనుకుంటున్నా. మహిళల గురించి, మహిళ ప్రధాన పాత్రలుగా సినిమాలు తీయడానికి నేను ఇష్టపడతాను. కానీ పురషుడి పాత్రను మహిళగా మార్చడాన్ని నేను అంగీకరించలేను" - బార్బరా బ్రకోలి, బాండ్ 25వ చిత్ర నిర్మాత.

జేమ్స్​బాండ్ 25వ చిత్రాన్ని జమైకాలో ఆవిష్కరిస్తూ.. ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాలో డేనియల్​ క్రేగ్​.. బాండ్​గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నాలుగు సినిమాల్లో జేమ్స్​బాండ్​గా కనిపించాడు.

బాండ్​ సిరీస్​లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. త్వరలో రాబోతున్న 25వ చిత్రంలో ఆస్కార్​ విజేత రమీ మాలెక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details