తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్: ఎవరు ఎవర్ని కొట్టినా చిరంజీవి మాత్రం మనమే - bommablockbuster puri jagannath

యాంకర్ రష్మీ హీరోయిన్​గా నటించిన 'బొమ్మ బ్లాక్​బస్టర్' టీజర్ అలరిస్తోంది. త్వరలో ఓటీటీలో సినిమా విడుదలయ్యే అవకాశముంది.

bomma blockbuster official teaser
నందు రష్మిీ

By

Published : Oct 2, 2020, 12:36 PM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్ వీరాభిమాని కథతో తీస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్​బస్టర్'. నందు, రష్మీ జంటగా నటిస్తున్నారు. శుక్రవారం విడుదలైన టీజర్​.. నవ్విస్తూనే ఆసక్తి రేకెత్తిస్తోంది.​

తన జీవితాన్ని కథగా రాసి, ఇష్టమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్​కు ఇవ్వాలనే తాపత్రయం ఉన్న పల్లెటూరి మాస్ కుర్రాడిగా నందు కనిపించనున్నాడు. అతడి ప్రేయసి పాత్రలో రష్మీ నటించింది. 'పోకిరి'లోని డైలాగ్​ పౌరాణికంలో చెప్పడం, 'నేను ఆళ్లను కొట్టినా, ఆళ్లు నన్ను కొట్టినా నేను మాత్రం చిరంజీవి మాత్రం మనమే' అంటూ సాగే సంభాషణ ఆకట్టుకుంటోంది.

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించగా, రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details