తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధనుష్​, విజయకాంత్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు - ధనుష్​, విజయకాంత్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు

కోలీవుడ్​ నటులు విజయకాంత్​, ధనుష్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి పోలీస్​ కంట్రోల్​రూమ్​కు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చాడు. అందులో నిజం లేదని తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

bomb threats to dhanush and vijayakanths houses
ధనుష్​, విజయకాంత్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు

By

Published : Oct 14, 2020, 2:15 PM IST

తమిళ కథానాయకులు విజయకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు రెండు సార్లు ఫోన్‌ చేశారు. చెన్నైలోని అభిరామపురంలో గల ధనుష్​ ఇంటిలో, విరుగంబక్కంలోని విజయకాంత్‌ ఇంట్లో బాంబులు పెట్టారని సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారంలో నిజం లేదని తేల్చారు. ప్రాథమిక విచారణలో రెండుసార్లు ఫోన్‌ చేసిన వ్యక్తి ఒక్కరేనని గుర్తించినట్లు తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చి, అసౌకర్యం కలిగించినందుకు ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.

కొన్ని నెలలుగా కోలీవుడ్‌లో ఇలాంటి బెదిరింపుల ఫోన్‌కాల్స్‌ ఎక్కువైపోయాయి. రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య ఇళ్లకూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఓ మానసిక వికలాంగుడు ఈ ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. జులై 18న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి అజిత్‌ ఇంట్లో బాంబు ఉందని హెచ్చరించాడు. పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని సోదాలు చేసి, అది తప్పుడు సమాచారమని నిర్ధారించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details