ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే దానిపై ఇతర భాషల దర్శక నిర్మాతలకు కన్నుపడటం సహజమే. దానిని డబ్ చేయడం లేదా నేటివిటీకి తగ్గట్లు మలుచుకుని రీమేక్‌లు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను దక్షిణాది చిత్రాలపై ఎక్కువగానే పడిందని చెప్పాలి. అనేక సినిమాలు ఇక్కడి నుంచి బీటౌన్‌కు వలస వెళ్లాయి. ఇందులో పలు సినిమాలు విజయవంతమైనప్పటికీ మరికొన్ని తుస్సుమనిపించాయి.
కథలోని ఒరిజినాలిటీ మరుగునపడిపోవడమో, సన్నివేశాలను మాతృక స్థాయిలో తెరకెక్కించకపోవడం లేదా నటుల ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడం సహా ఇతరత్రా కారణాల వల్ల ప్రేక్షాదరణ దక్కక ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా విడుదలై కలెక్షన్లు పరంగా పర్వాలేదనిపించినప్పటికీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో అల్లుఅర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం'లోని 'సీటీమార్' పాటను రీక్రియేట్ చేశారు. అది అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది!. దీంతో ఈ సినిమా కథ, నటుల పర్ఫామెన్స్, సాంగ్స్ ఇలా అన్నింటిపై మీమ్స్ రూపొందించి నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇక్కడ హిట్ అయి హిందీ పరిశ్రమలో అత్యంత దారుణంగా పరాజయం పొందిన సినిమాల వివరాలను తెలుసుకుందాం..
సింబా (టెంపర్) - Temper
ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'టెంపర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 2018లో 'సింబా' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రం మాతృక స్థాయిలో అభిమానులను అంతగా ఆకట్టుకోలేకోపోయిందనే చెప్పాలి. పూరీ ఇంటెన్సిటీని రోహిత్ శెట్టి 'సింబా'లో చూపించడంలో విఫలమయ్యారు.
లక్ష్మీబాంబ్ (కాంచన) - Kanchana
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'లక్ష్మీబాంబ్'. కియారా అడ్వాణీ హీరోయిన్. ఈ సినిమా దక్షిణాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన 'కాంచన'కు రీమేక్. తెలుగులోనూ విజయం సాధించింది. అన్నీ భాషల్లోనూ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కానీ హిందీలో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది!.
భాగమతి