తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉమెన్స్​ డే: నిజ జీవిత నాయికలకు పట్టాభిషేకం - జాన్వీ గుంజన్ సక్సేనా సినిమా

బాలీవుడ్​లో కొన్ని నెలల్లో రానున్న మహిళా ప్రాధాన్య​ చిత్రాలు ఇప్పటినుంచే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాటిలో కంగనా రనౌత్, జాన్వీ కపూర్, ఆలియా భట్, విద్యాబాలన్ తదితరులు నటిస్తుండటం వల్ల ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.

ఉమెన్స్​ డే: నిజ జీవిత నాయికలకు పట్టాభిషేకం
ఆలియా భట్ జాన్వీ కపూర్

By

Published : Mar 8, 2020, 8:30 AM IST

యుద్ధవిమానాల్లో విన్యాసాలు చేసే సాహసనారి ఒకరు. అమ్మ అని పిలిపించుకున్న ప్రజా నాయకురాలు మరొకరు. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుతెచ్చుకున్న సరస్వతీ స్వరూపం ఇంకొకరు. చీకటి సామ్రాజ్యంలో చిక్కి శల్యమైనా చిరుత పులిలా తిరగబడిన వీరవనిత మరొకరు. ఈ నలుగురు నిజ జీవిత నాయికల స్పూర్తిదాయక కథలు వెండితెరపై ఆవిష్కారం కానున్నాయి. వారి పాత్రల్లో నలుగురు అగ్ర కథానాయికలు నటిస్తున్నారు. నాయిక పాత్రకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్న ఆ నటీమణుల గురించి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం.

కంగనా రనౌత్‌ నటిస్తోన్న చిత్రం 'తలైవి'. హీరోయిన్​గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితకథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు జయలలితగా కంగన ఒదిగిపోతున్న తీరును కళ్లకు కట్టాయి.

తలైవి సినిమాలో కంగనా రనౌత్

భారత వైమానిక దళంలో తొలి మహిళా పైలట్‌గా పనిచేసి కార్గిల్‌ యుద్ధంలో సత్తా చాటిన గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌'. గుంజన్‌ పాత్రలో జాన్వీ నటిస్తోంది. పాత్ర కోసం విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుని సిద్ధమైంది జాన్వీ.

గుంజన్ సక్సేనా బయోపిక్​లో జాన్వీ కపూర్

గణిత శాస్త్రంలో తన ప్రజ్ఞతో ప్రపంచాన్నే అబ్బురపరచిన శకుంతలా దేవి జీవితకథతో తెరకెక్కుతున్న చిత్రం 'శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌'. విద్యా బాలన్‌ టైటిల్​ రోల్​లో కనిపిస్తుండటం ఆసక్తికరం.

ముంబయిలోని కామాటిపుర వేశ్యాగృహానికి బలవంతంగా చేరి, కాల క్రమంలో తనలాంటి అభాగ్యుల రక్షణ కోసం డాన్‌గా ఎదిగిన గుంగూబాయి కథియావాడి జీవితకథతో రూపొందుతున్న చిత్రం 'గంగూబాయి కథియావాడి'. ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆలియా ఈ పాత్ర కోసం పూర్తి డీగ్లామర్‌గా మారిపోయింది. ఈ నాయికల ప్రయత్నాలు సఫలమైతే మరింత మంది వీరి బాటలో నడవడం ఖాయం.

'గంగుబాయ్'లో ఆలియా భట్

ABOUT THE AUTHOR

...view details