తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ చిత్రంలో బాలీవుడ్​ తారల సందడి? - power star new movie

పవన్​ కళ్యాణ్​ సినిమా అంటేనే అభిమానుల అంచనాలు ఓ రేంజ్​లో ఉంటాయి. పవర్​ స్టార్​ హీరోగా, క్రిష్​ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. ఈ మూవీలో బాలీవుడ్​ తారలు కూడా కనిపించనున్నట్లు సమాచారం.

bollywood starts act in pawan kalyan new movie directed by krish
పవన్​ చిత్రంలో బాలీవుడ్​ తారల సందడి?

By

Published : Feb 28, 2020, 7:44 AM IST

Updated : Mar 2, 2020, 8:00 PM IST

తెలుగులో పాన్‌ ఇండియా సినిమాల జోరు కనిపిస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాల్ని తెలుగుతో పాటు ఇతర భాషల్నీ లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే వాటిలో కీలక పాత్రల కోసం.. వివిధ భాషలకి చెందిన నటీనటుల్నీ ఎంపిక చేసుకుంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే మొదలైంది. పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న ఈ చిత్రం కోసం హిందీ నటులు అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందులో మరో కథానాయికకి కూడా చోటుందట. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలోనే మొదలు కాబోతోంది.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
అర్జున్‌ రాంపాల్‌

మరో వైపు 'పింక్‌' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నాడు పవన్​కల్యాణ్​. ఈ చిత్రంలో పవన్‌.. న్యాయవాది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే 15న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

Last Updated : Mar 2, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details