తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బొజ్జ గణపయ్య సేవలో బాలీవుడ్​ ప్రముఖులు - సోనూసూద్​

వినాయక చవితి సందర్భంగా గణపయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు బాలీవుడ్ ప్రమఖులు. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

వినాయకుడి పూజలో బాలీవుడ్​ ప్రముఖులు

By

Published : Sep 2, 2019, 5:02 PM IST

Updated : Sep 29, 2019, 4:37 AM IST

బాలీవుడ్​ ప్రముఖులు సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, వివేక్​ ఒబెరాయ్​, ఏక్తా కపూర్​తో పాటు సల్మాన్​ఖాన్​సోదరి అర్పితా ఖాన్​ తదితరు​లు వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో పంచుకున్నారు.

కుటుంబంతో పండుగ జరుపుకుంటున్న వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది నిర్మాత ఏక్తా కపూర్. తనకు, తండ్రి జితేంద్రకు తల్లి శోభాకపూర్ బాస్​ అయితే.. వినాయకుడు అందరికీ బాస్​ అంటూ ట్వీట్ చేసింది.

"నాకు ఎంతో ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. గతేడాది ఇదే సమయానికి ఇంట్లో ఉండే అవకాశం రాలేదు. ఈ రోజు నా కుటుంబంతో ఎంతో ఆనందంగా జరుపుకున్నా" అంటూ సోనాలి బింద్రే ట్వీట్​ చేసింది.

వినాయకుడి పూజలో సోనాలీ బింద్రే

పర్యావరణానికి హాని కలిగించని వినాయకుడిని పూజించానని చెప్పిన నటి శిల్పాశెట్టి.. కుటుంబంతో ఉన్న ఫొటోను పోస్ట్​ చేసింది.

ఫ్యామిలీతో శిల్పా శెట్టి

"పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్లాస్టిక్​ను వాడకుండా పచ్చదనాన్ని పెంచుదాం. గణపతి బొప్పా మోరియా" అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు నటుడు, నిర్మాత వివేక్​ ఒబెరాయ్.

బొజ్జ వినాయకుడితో వివేక్​ ఒబెరాయ్​ ఫ్యామిలీ

సల్మాన్​ఖాన్​ సోదరి అర్పితాఖాన్..​ తన తల్లి సాల్మాఖాన్​తో వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

వినాయకుడితో అర్పితాఖాన్​
ఉండ్రాళ్ల గణపతితో సోనూసూద్​
వినాయకుడితో కార్తిక్​ ఆర్యన్​

ఇదీ చూడండి: మామ పుట్టినరోజు.. అల్లుడు సెలబ్రేషన్

Last Updated : Sep 29, 2019, 4:37 AM IST

ABOUT THE AUTHOR

...view details