కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో వెండితెర బోసిపోయింది. ప్రొజెక్టర్ ఆగిపోయింది. టికెట్ కొనేవాడు లేక కౌంటర్ ఖాళీ అయిపోయింది. వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతున్న కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే దిక్కవుతున్నాయి. అయితే టాలీవుడ్‌లోని పలువురు దర్శక నిర్మాతలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పలువురు స్టార్స్ నటించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్నీ+హాట్‌స్టార్‌లో ఏడు సినిమాలు
సోమవారం జరిగిన 'బాలీవుడ్ కి హోం డెలివరీ' లైవ్ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు బాలీవుడ్ స్టార్స్.. తమ కొత్త సినిమాల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో అక్షయ్ కుమార్ 'లక్ష్మీబాంబ్', అజయ్ దేవగణ్ 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా', సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'దిల్ బెచారా', ఆలియా భట్ 'సఢక్2', అభిషేక్ బచ్చన్ 'ది బిగ్‌బుల్', విద్యుత్ జమ్వాల్ 'ఖుదా హఫీజ్', కునాల్ ఖేమూ 'లూట్ కేస్' చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ జులై నుంచి అక్టోబరు మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
దిల్బెచారా సినిమాలో సుశాంత్ సింగ్- సంజనా సంఘీ అభిషేక్, నిత్యా మేనన్- 'బ్రీత్' సీజన్ 2
ప్రముఖ కథానాయకుడు అభిషేక్ బచ్చన్, నటి నిత్యా మేనన్.. 'బ్రీత్: ఇన్‌టూ ద షాడోస్' వెబ్‌సిరీస్‌తో ఓటీటీ అరంగేట్రం చేశారు. వీరితో పాటే తొలిసీజన్లో నటించిన సయామీ ఖేర్, అమిత్ సాధ్.. ఇందులో కీలక పాత్రలు పోషించారు. కుమార్తె కోసం వెతికే తండ్రి పాత్రలో అభిషేక్ కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో జులై 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
బ్రీత్ వెబ్‌సిరీస్‌లో అభిషేక్ బచ్చన్-నిత్యామేనన్ జాన్వీ కపూర్-గుంజన్ సక్సేనా
అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్'. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్ర హక్కులు రూ.70 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశారని సమాచారం.
గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్ విద్యాబాలన్-శకుంతలదేవి
భారతీయ గణితశాస్త్ర దిగ్గజం శకుంతలదేవి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'శకుంతల దేవి'. ఆమె పాత్రను ప్రముఖ నటి విద్యాబాలన్ పోషించారు. ఇప్పటికే లుక్స్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు. తొలుత థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ, కరోనా వల్ల ఓటీటీ వేదికగా అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.
'శకుంతలా దేవి'లో విద్యాబాలన్ మనోజ్ భాజ్‌పాయ్, సమంత- ద ఫ్యామిలీ మ్యాన్ 2
దేశంలో అసాంఘిక కార్యకలాపాలు సృష్టించేందుకు పన్నాగం వేసిన ఉగ్రవాదులను, ఎన్ఐఏ అధికారులు ఎలా మట్టుబెట్టారు అనే కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఇప్పటికే వచ్చిన తొలి సీజన్ విపరీతమైన స్పందన దక్కించుకోగా, రెండో సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మనోజ్ భాజ్‌పాయ్‌తో పాటు దక్షిణాది ముద్దుగుమ్మ సమంత ఇందులో నటిస్తుండటం వల్ల అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఈమె ఉగ్రవాది పాత్రలో కనిపించనుందని సమాచారం. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందీ సీజన్.
వీటితో పాటే సైఫ్ అలీఖాన్(దిల్లీ-అమెజాన్ ప్రైమ్), స్వరభాస్కర్(రస్బరీ-అమెజాన్ ప్రైమ్), రైమా సేన్(ద లాస్ట్ అవర్-అమెజాన్ ప్రైమ్), కొంకణ్ సేన్ శర్మ(ముంబయి డైరీస్ 26/11-అమెజాన్ ప్రైమ్), అమోల్ పాలేకర్-మానవ కౌల్(గోర్మింట్-అమెజాన్ ప్రైమ్), అఫ్తాబ్ శివ్దశానీలు(పాయిజన్:2-జీ5).. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఓటీటీ సంస్కృతి ఇలానే కొనసాగితే, ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత సినీ వీక్షకుడు థియేటర్లో చూసేందుకు ఇష్టపడతాడా? డిజిటల్వైపే మొగ్గుచూపుతాడా? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.