తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'షారుఖ్​​​​​ రీల్​ హీరో మాత్రమే కాదు రియల్​ హీరో' - salman khan, salman khan calls shah rukh khan hero, salman appreciation post for shah rukh khan, salman khan instagram, salman calls srk hero, srk saves aishwarya rai manager, srk rescues Archana Sadanand

బాలీవుడ్​ నటుడు షారుఖ్​​ ఖాన్​ను నిజమైన హీరోగా అభివర్ణించాడు కండల వీరుడు సల్మాన్​ఖాన్​. షారుఖ్​​కు చెందిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుని కింగ్​ ఖాన్​ను కొనియాడాడు.

'షారుఖ్​​​​​ రీల్​ హీరో మాత్రమే కాదు రియల్​ హీరో'

By

Published : Oct 31, 2019, 4:55 PM IST

Updated : Oct 31, 2019, 6:43 PM IST

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ తన స్నేహితుడు, సహనటుడైన షారుఖ్​ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నటి ఐశ్వర్యా రాయ్​ మేనేజర్​ను మంటల నుంచి కాపాడినందుకు బాద్​షాను మెచ్చుకున్నాడీ కండల వీరుడు. షారుఖ్​ రియల్‌ హీరో అని పొగుడుతూనే.. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమా నుంచి ఓ సన్నివేశాన్ని పోస్ట్‌ చేశాడు. 'మంటల్లోకి దూకి.. ప్రాణాలను కాపాడేవాడే హీరో' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఏమైంది..?

ఇటీవల బాలీవుడ్‌ మెగాస్టార్​ అమితాబ్‌ బచ్చన్‌ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు అక్షయ్​ కుమార్​, ట్వింకిల్​ ఖన్నా, షాహిద్​ కపూర్​, మిర్జా రాజ్​పుత్​, అనుష్క శర్మ, విరాట్​ కోహ్లీ, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్​ సహా అమితాబ్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నటి ఐశ్వర్య రాయ్‌ మేనేజర్‌ అర్చనా సదానంద్‌ లెహెంగాకు నిప్పు అంటుకుంది. దీన్ని గమనించిన షారుఖ్​ వెంటనే మంటల్ని ఆర్పేశాడు. ఈ ప్రమాదంలో అర్చన స్వల్పగాయాలతో బయటపడగా.. కింగ్​ ఖాన్​కు కూడా చిన్నపాటి గాయలైనట్లు సమాచారం.

దీపావళి వేడుకల్లో ఐశ్వర్య కుటుంబం, ఐష్​తో మేనేజర్‌ అర్చనా సదానంద్‌

ఈ ఏడాది విడుదలైన సల్మాన్‌ఖాన్‌ 'భారత్‌' చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ హీరో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'దబాంగ్‌ 3'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సోనాక్షి సిన్హా కథానాయిక. గతేడాది విడుదలైన 'జీరో' సినిమాలో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్​​ ఖాన్‌. చాలా రోజుల విరామం తర్వాత 'మెర్సల్'​ హిందీ రీమేక్​లో.. కోలీవుడ్​ దర్శకుడు అట్లీతో కలిసి ఈ స్టార్​ హీరో పనిచేస్తాడని వార్తలు వస్తున్నాయి.

Last Updated : Oct 31, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details