తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాపై పోరుకు అక్షయ్​ రూ.25 కోట్ల విరాళం - అక్షయ్​ కుమార్​ కొత్త సినిమా అప్​డేట్​

కరోనా నియంత్రణలో భాగంగా సినీపరిశ్రమ తన వంతు సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇందులో భాగం అవ్వగా.. తాజాగా బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ ఆ జాబితాలో చేరాడు. కరోనాపై పోరాటానికి రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు.

Bollywood star Akshay Kumar donates Rs 25 crore to Prime Minister's Aid
కరోనాపై పోరాటంలో అక్షయ్​ రూ.25 కోట్ల విరాళం

By

Published : Mar 28, 2020, 7:38 PM IST

మహమ్మారి కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలువురు సినీప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఇప్పుడా జాబితాలో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ చేరాడు. కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం తన వంతు సాయంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించి తనకున్న పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు అతడు ప్రకటించాడు.

అక్షయ్​ ప్రస్తుతం నటిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రీకరణ దశలో ఉంది. మార్చి 28న విడుదల కావాల్సిన 'సూర్యవంశీ' చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో.

ఇదీ చూడండి.. అక్షయ్​కు డైలాగ్​ డెలివరీలో ప్రత్యేక శిక్షణ! ​

ABOUT THE AUTHOR

...view details