ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ కూతురు ఇరాఖాన్ దర్శకురాలి అవతారమెత్తింది. ఆమెకు నటనలో కన్నా ఫిల్మ్ మేకింగ్‌లోనే ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల ఆమిర్ ఆ వైపు ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఇరా తెరకెక్కించిన ఓ సినిమా పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడీ స్టార్ హీరో. ఆమెకు గుడ్‌లక్ అని కూడా చెప్పాడు.
కెమెరా పట్టిన ఆమిర్ కుమార్తె... దర్శకురాలిగా ఎంట్రీ - కెమేరా పట్టిన ఆమిర్ తనయ... దర్శకురాలిగా ఎంట్రీ
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుటుంబం నుంచి ఓ అమ్మాయి సినీ పరిశ్రమలో అడుగుపెట్టనుంది. అయితే ఆమె ఎవరో కాదు మొదటి భార్య రీనాదత్తా, ఆమిర్ కూతురు ఇరాఖాన్. ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకురాలిగా ఓ సినిమా తెరకెక్కించింది.
![కెమెరా పట్టిన ఆమిర్ కుమార్తె... దర్శకురాలిగా ఎంట్రీ bollywood star aamir khan wihses daughter ira khan as she debuts as a director with theatres production 2019](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5307079-588-5307079-1575793523984.jpg)
కెమెరా పట్టిన ఆమిర్ తనయ... దర్శకురాలిగా ఎంట్రీ
గ్రీక్ విషాదంతో కూడిన 'యురిపిడెస్ మేడియా' అనే చిత్రానికి 'ఇరా' దర్శకత్వం వహించింది. ఈనెల 7 నుంచి 22 వరకు ముంబయిలోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 431 బీసీ కాలం నేపథ్యంగా కథాంశం తెరకెక్కింది. అలనాటి నటి, కమల్ హాసన్ మాజీ భార్య సారిక దీనికి నిర్మాతగా వ్యవహరించింది.
ఇరా ఖాన్ గతంలో మిషాల్ కిర్సాలానీ అనే మ్యూజిక్ కంపోజర్‌తో ప్రేమాయణం నడిపింది. ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ జోడీ ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.