ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం లేదా రీమేక్ చేయడం చిత్రసీమలో షరా మామూలే. ఇలా బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ హిందీలో రీమేక్ అయ్యాయి. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'గజిని' (2008) నుంచి 'అర్జున్‌రెడ్డి' (2019) వరకు బాలీవుడ్లో అనేక రీమేక్ సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ సూపర్‌హిట్ అయ్యి బాలీవుడ్లో తుస్సుమనిపించిన సినిమాల వివరాలేంటో చూడండి.
ఓకే జాను (2017)
విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం 'ఓ కాదల్ కన్మయి' (2015). తెలుగులో 'ఓకే బంగారం'గా విడుదల చేసి హిట్‌ను అందుకున్నారు. అయితే ఇదే సినిమాను బాలీవుడ్లో 'ఓకే జాను'గా రూపొందించగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
రన్ (2004)
2002లో విడుదలైన 'రన్' అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అభిషేక్ బచ్చన్, భూమిక చావ్లా ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం ఎదుర్కోవడం సహా విమర్శకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేసినప్పుడు విశేషాదరణ దక్కించుకుంది.
ప్రస్థానం (2019)
టాలీవుడ్లో విడుదలైన 'ప్రస్థానం' (2010) చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్, మనీషా కోయిరాల, జాకీ ష్రాఫ్, అలీ ఫజల్, సత్యజిత్ దూబే, అమైరా దస్తూర్, చుంకీ పాండే ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రామయ్యా వస్తావయ్యా (2013)