కరోనా కారణంగా వచ్చిన విరామాన్ని కొందరు సినీ ప్రముఖులు భవిష్యత్ కార్యాచరణ కోసం వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ ప్రస్తుతం ఇదే పని చేస్తోంది. కుటుంబంతో గడిపేందుకు మనాలీ వెళ్లిన కంగనా.. తన తర్వాతి చిత్రం కోసం వ్యక్తిగత ట్రైనర్ సిద్ధార్థా సింగ్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి కంగనా బృందం ఓ ఫొటో, వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది.
'ధాకడ్' కోసం కసరత్తులు చేస్తోన్న కంగనా
కరోనా కారణంగా సినీ ప్రముఖులకు కొంత విరామం లభించింది. ఈ నేపథ్యంలో నటీనటులు వారికి నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం అదే పనిలో ఉంది. తన కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తోంది.
'ధాకడ్' కోసం కసరత్తులు చేస్తోన్న కంగనా
ప్రస్తుతం కంగనా ఏఎల్.విజయ్ దర్శకత్వంలో 'తలైవి' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె దాదాపు 20 కేజీల బరువు పెరిగింది. కానీ, త్వరలో మొదలు కాబోయే తన కొత్త చిత్రం 'ధాకడ్' కోసం గతంలో తానున్న రూపంలోకి రావల్సి ఉంది. అందుకే ఇప్పుడీ విరామ సమయాన్ని తన బరువు తగ్గించుకునేందుకు ఉపయోగిస్తుంది కంగనా.
ఇదీ చూడండి.. మెగాస్టార్ చిత్రంపై వస్తోన్న పుకార్లపై నిర్మాత స్పందన
Last Updated : Mar 21, 2020, 3:30 PM IST