ప్రతి ఏడాది బారతీయ సినీ పరిశ్రమలోకి కొత్త అందాలు వస్తూనే ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది ఏ ప్రాంతమైనా కొందరు హీరోయిన్లు అరంగేట్రంలోనే అదరగొట్టిన వారు ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హోదా సంపాదించుకున్నారు. అలాగే ఈ ఏడాది కూడా కొంతమంది తారలు బాలీవుడ్లో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అరంగేట్ర సినిమాతోనే అదరగొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021లో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
ఇసాబెల్లే కైఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది ఇసాబెల్లే కైఫ్. సూరజ్ పంచోలీ హీరోగా తెరకెక్కిన 'టైమ్ టూ డ్యాన్స్' చిత్రంతో ఈనెల ప్రారంభంలో థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం పుల్కిత్ సామ్రాట్‌తో 'సుస్వాగతం ఖుషమ్డీడ్', ఆయుష్మాన్ ఖురానాతో 'క్వాతా' వంటి చిత్రాల్లో నటిస్తోంది.
పాలక్ తివారి
ప్రముఖ టెలివిజన్ నంటి శ్వేతా తివారి కుతూరు పాలక్ తివారి. 'రోసీ: ద సాఫ్రాన్ చాప్టర్' అనే చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. ఇందులో వివేక్ ఒబేరాయ్ హీరో.
మానుషీ చిల్లర్
2019లో తన బాలీవుడ్ అరంగేట్రం గురించి వెల్లడించింది మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న 'పృథ్వీరాజ్' చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రిన్సెస్ సాన్యోగత పాత్రలో కనిపించనుంది మానుషి.
షాలినీ పాండే