తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్ మృతికి కారణమిదే! - Bollywood Music Composer Wajid Khan died due to cardiac arrest confirmed by his family

సంగీత దర్శకుడు వాజిద్​ఖాన్​​ మృతికి కారణం వెల్లడించారు అతడి కుటుంబసభ్యులు. ఈ మేరకు ఇన్​స్టా వేదికగా ఓ నోట్​ విడుదల చేశారు. వాజిద్​ కరోనా వల్ల చనిపోయినట్లు వార్తలను ఖండించారు. అతడు జూన్​ 1న మరణించినట్లు స్పష్టం చేశారు.

Wajid Kha
వాజిద్​ఖాన్​​

By

Published : Jun 6, 2020, 10:01 AM IST

బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ మృతిపై క్లారిటీ ఇచ్చారు అతడి కుటుంబసభ్యులు. 47 ఏళ్ల ఈ సింగర్​ గుండెపోటుతో చనిపోయినట్లు స్పష్టం చేశారు. కరోనాతో చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. చికిత్స సమయంలో పర్యవేక్షణ చూసిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

" 47 ఏళ్ల వాజిద్​ ఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. జూన్​ 1వ తేదీ ​తెల్లవారుజామున 12:30 గంటలకు సురణ సేతియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించాడు. గతేడాది కిడ్నీ మార్పిడి ఫలించింది. ప్రస్తుతం గొంతు సంబంధిత ఇన్​ఫెక్షన్​తో బాధపడుతూ ఆస్పత్రిలో​ చేరాడు. అతడి చికిత్సలో చివరివరకు సహకరించిన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు"

-- వాజిద్​ కుటుంబసభ్యులు

వాజిద్​ మృతి పట్ల.. అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రా, అక్షయ్‌ కుమార్‌, పరిణీతి చోప్రా, సోనమ్‌ కపూర్‌, వరుణ్‌ధావన్‌ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' సినిమాతో సంగీత దర్శకుడిగా సినీ కెరీర్‌ను ప్రారంభించాడు వాజిద్‌ ఖాన్‌. అలా సల్మాన్‌ నటించిన చాలా సినిమాలకు ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 'పార్ట్నర్'‌, 'వాంటెడ్', 'వీర్', 'దబాంగ్‌' చిత్రాలు వాజిద్‌ఖాన్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలోనూ సల్మాన్‌ రూపొందించిన 'భాయ్‌ భాయ్‌', 'ప్యార్‌ కరోనా' పాటలకు వాజిద్‌ సంగీతం అందించాడు.

ఇదీ చూడండి: జాన్వీ కపూర్​ కుటుంబానికి క్వారంటైన్​ పూర్తి!

ABOUT THE AUTHOR

...view details