తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంటెంటే కింగ్ అని నిరూపించిన బాలీవుడ్ చిత్రాలు - kabir sing

కంటెంట్​ను నమ్మిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే దర్శక నిర్మాతల ఆనందాలకు అవధులుండవు. అలా బాలీవుడ్​లో కథనే నమ్ముకుని విజయం సాధించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్
బాలీవుడ్

By

Published : Mar 18, 2020, 6:41 AM IST

ఏ సినీ ఇండస్ట్రీ అయినా సక్సెస్ ఫార్ములాను నమ్ముకుంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ ఫార్ములానే ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ ఇందుకు భిన్నంగా కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబడుతుంటాయి. కంటెంట్ ఉంటే చాలంటూ నిరూపిస్తాయి. అలా హిందీ పరిశ్రమలో సక్సెస్ ఫార్ములాకు వ్యతిరేకంగా తెరకెక్కించి హిట్ అందుకున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

క్వీన్ (2014) - 61 కోట్లు

కంగనా రనౌత్​ను స్టార్ హీరోయిన్​ చేసిందీ సినిమా. ఒంటరిగా ట్రావెల్ చేయడం ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. దీంతో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు మూవీకి ప్లస్ పాయింట్​గా మారాయి. స్వతంత్ర భావాలున్న యువతులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

క్వీన్

కహానీ (2012) - 59.26 కోట్లు

ఈ సినిమాలో ఓ విభిన్న పాత్రలో నటించిన విద్యా బాలన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తక్కువ బడ్జెట్​తో తీసిన ఈ చిత్రం 59 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కోల్​కతాలో తన భర్తను వెతుక్కుంటూ ప్రయాణం సాగించిన ఓ గర్భిణి కథతో తెరకెక్కిందీ చిత్రం. ప్రేక్షకులను సస్పెన్స్​కు గురిచేస్తూ ఘనవిజయం అందుకుంది.

కహానీ

ఆషికీ 2 (2013) - 85.40 కోట్లు

​పాత చిత్రం 'ఆషికీ' హవాను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించింది 'ఆషికీ 2'. ఈ సినిమాలో ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ వారి పాత్రల్లో మెప్పించారు. ఇందులోని పాటలు శ్రోతల్ని ఉర్రూతలూగించాయి. లవ్ ఆంథమ్​గా నిలిచాయి. అద్భుతమైన లవ్​ స్టోరీతో పాటు సెలిబ్రిటీలు ఆల్కహాల్, డ్రగ్స్​కు ఎలా బానిసలవుతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఆషికి 2

ద డర్టీ పిక్చర్ (2011) - 85 కోట్లు

విద్యా బాలన్ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రం మొదట సెన్సార్ చిక్కుల్ని ఎదుర్కొంది. తర్వాత అన్ని అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. ప్రముఖ నటి సిల్క్​ స్మిత జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయిందని చెప్పవచ్చు.

ద డర్టీ పిక్చర్

బాఘీ 2 (2018) - 165 కోట్లు

టైగర్ ష్రాఫ్​ను స్టార్​ను చేసిన సినిమా ఇది. ఇతడిని యాక్షన్ హీరోగా నిలబెట్టడంలో ఈ చిత్రానిదే ప్రముఖ పాత్ర. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లను ఎవ్వరూ ఊహించలేదు.

బాఘీ 2

తను వెడ్స్ మను రిటర్న్స్ (2015) - 152 కోట్లు

ఒక సాధారణ లవ్​ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తన భార్యకు విడాకులు ఇచ్చిన హీరో.. ఆమె సోదరితో ప్రేమలో పడటమే కథ. మాధవన్, కంగనా రనౌత్ తమ పాత్రల్లో మెప్పించారు.

తను వెడ్స్ మను రిటర్న్స్

సోనూ కే టీటూ కీ స్వీటీ (2018) - 108.71 కోట్లు

కార్తీక్ ఆర్యన్​ను స్టార్​గా నిలబెట్టిందీ సినిమా. స్నేహానికి మించిన బంధం ఏదీ లేదని చాటిచెప్పే ప్రయత్నం అందరినీ అకట్టుకుంది. ఈ తరానికి ఫేవరేట్ చిత్రంగా నిలిచింది.

సోనూ కీ టీటూ కీ స్వీటీ

బాహుబలి 1 (120 కోట్లు), బాహుబలి 2 (511 కోట్లు)

బాలీవుడ్​లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాటిక్ ఎక్స్​పీరియన్స్​ను ప్రేక్షకులు ఎంతగా కోరుకుంటాన్నారో ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. స్టోరీతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్​ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. దక్షిణాది నుంచి వచ్చి ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది.

బాహుబలి

స్త్రీ (2018) - 129 కోట్లు

హారర్​ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుుడూ నీరాజనాలు పలుకుతుంటారు. అందులోనూ హారర్ కామెడీ అంటే మరీ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ జోనర్​లో వచ్చిన 'స్త్రీ' అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది.

స్త్రీ

అంధాధున్ (2018) - 72.50 కోట్లు

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఘనమైన వసూళ్లూ దక్కాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.

అంధాధున్

బదాయి హో (2018) - 136.80 కోట్లు

ఆయుష్మాన్ ఖురాన్​ను విభిన్న కథానాయకుడిగా మరో మెట్టు ఎక్కించిందీ సినిమా. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపర్చిన ఆయుష్మాన్ మరోసారి తన నటనతో మెప్పించాడు.

బదాయి హో

ఉరి - ద సర్జికల్ స్ట్రయిక్ (2019) - 244 కోట్లు

యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. సర్జికల్ స్ట్రయిక్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గానూ విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.

ఉరి

కబీర్ సింగ్ (2019) - 278 కోట్లు

తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్​గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కాడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. షాహిద్ కపూర్ కెరీర్​లో బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది.

కబీర్ సింగ్

ABOUT THE AUTHOR

...view details