బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తుఫాన్'. రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 21న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సరికొత్త పోస్టర్లను చిత్రబృందం పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు.
బాలీవుడ్ నటుడు షార్మాన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన 'ఫౌజీ కాలింగ్' సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆర్యాన్ సక్సెనా దర్శకత్వం వహించారు.