తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనోహర్ మృతిపై బాలీవుడ్ సంతాపం - sanjay dat

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల బాలీవుడ్ నటులు విచారం వ్యక్తం చేశారు.

పారికర్ తో అమితాబ్

By

Published : Mar 18, 2019, 11:07 AM IST

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్​ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అమితాబ్, హేమ మాలిని, సంజయ్​దత్​తో పాటు పలువురు ట్విట్టర్ వేదికగా సానుభూతి వ్యక్తంచేశారు.

"పారికర్ ఓ జెంటిల్​మన్.. ఎంతో గౌరవప్రదంగా నడుచుకుంటారు.." అంటూ ఆయనతో దిగిన ఫొటోను అమితాబ్ ట్విట్టర్లో పంచుకున్నారు.

"జనాదరణ పొందిన, సమర్థమైన ముఖ్యమంత్రి పారికర్" అని బాలీవుడ్ నటి హేమ మాలిని ట్వీట్​ చేశారు.

"పారికర్ మృతి బాధ కలిగించింది. ఆయన నిజమైన, గౌరవప్రదమైన, తెలివైన, నిజాయితీ గల వ్యక్తి. ప్రజలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు" అంటూ అనుపమ్ ఖేర్ విచారం వ్యక్తం చేశారు.

"ఓ గొప్ప రాజకీయ నాయకుడ్ని కోల్పోవడం బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అంటూ సంజయ్ దత్ ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details