బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. అందరి ముందు 'దఢక్' సినిమాలోని 'జింగ్ జింగ్ జింగాత్' పాటకు స్టెప్పులేసింది. ఫామ్‌లో ఉన్న కథానాయిక అయినప్పటికీ అభిమానులు అడిగిన వెంటనే డ్యాన్స్ చేయడం వల్ల నెటిజన్లు జాన్వీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అభిమానులు అడగ్గానే పబ్లిక్‌లో స్టెప్పులేసిన జాన్వీ - latest bollywood news
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానుల కోరిక మేరకు ఓ పాటకు డాన్స్ వేసి అలరించింది.
అభిమానులు అడగ్గానే పబ్లిక్‌లో స్టెప్పులేసిన జాన్వి
'దఢక్' చిత్రంతో అరంగేట్రం చేసిన జాన్వీ.. ఇటీవల వచ్చిన నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ 'ఘోస్ట్ స్టోరీస్'లో కనిపించింది. ఈమె నటించిన రెండో సినిమా 'గుంజన్ సక్సేన్: ది కార్గిల్ గర్ల్' నిర్మాణనంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. శరణ్ శర్మ దర్శకుడు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 24న విడుదల కానుంది. మరోవైపు 'రూహ్ ఆఫ్జా', 'దోస్తానా 2' లలోనూ నటిస్తూ బిజీగా ఉందీ భామ.
Last Updated : Mar 11, 2020, 7:52 AM IST