యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్లోని బంధుప్రీతి అంశం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడిన నటి కంగనా రనౌత్.. మాఫియాలో మిగిలిపోయిన కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లోనే హిందీ చిత్రసీమ నడుస్తోందని ఆరోపించింది. 'కాఫీ విత్ కరణ్' లాంటి అసమర్థ షోలతో ఇండస్ట్రీ నిండిపోయిందని తెలిపింది.
మాఫియా కనుసన్నల్లో బాలీవుడ్: కంగనా రనౌత్ - కంగనా
మాఫియా వ్యక్తుల చేతల్లో బాలీవుడ్ ఉందని, వారు చెప్పినట్లే నడుస్తోందని ఆరోపించింది నటి కంగన. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
కంగనా
విధేయత, విద్యా నేపథ్యం లాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తులు బాలీవుడ్ నుంచి ఎలిమినేట్ అవుతారని డా.సుబ్రహ్మణ్య స్వామి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కంగన స్పందిస్తూ ఈ ట్వీట్ చేసింది.
Last Updated : Aug 14, 2020, 1:27 PM IST