తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలీవుడ్​లో నెపోటిజమ్​ కంటే దాదాగిరి ఎక్కువ' - piyush mishra on bollywood dadagiri

హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి అంశాలు చర్చనీయాంశమవుతున్న తరుణంలో దాని గురించే నటుడు పియూష్ మిశ్రా మాట్లాడారు. నెపోటిజమ్​ కంటే ఇండస్ట్రలో దాదాగిరి చాలా ఎక్కువని వెల్లడించారు.

Bollywood is 'more about bullying than nepotism': Piyush Mishra
నటుడు పియూష్ మిశ్రా

By

Published : Sep 4, 2020, 12:02 PM IST

"నేను నీకంటే పెద్ద స్టార్​ను, నేను వస్తుంటే నిలబడటం తెలియదా?", "నువ్వ నా ఆశీర్వాదం తీసుకోలేదు" లాంటివి బాలీవుడ్​లో ఎక్కువని చెప్పారు సీనియర్ నటుడు-సంగీత దర్శకుడు-రచయిత పియూష్ మిశ్రా. ఇండస్ట్రీలో నెపోటిజమ్​ కంటే దాదాగిరి చేయడం ఎక్కువని తెలిపారు. తనకు మాత్రం అలాంటి సందర్భాలు ఎదురుకాలేదని వెల్లడించారు.

"నెపోటిజమ్ గురించి నేను ఆలోచించను. ఒకవేళ అది ఉన్నా నా ఎదుగుదలను ఆపలేదు, నా పనికి ఆటంకం కలిగించలేదు. నేను తెలివితక్కువ పనిచేస్తే తప్ప నన్ను ఇబ్బంది పెట్టడం సాధ్యపడదు. గతంలో కాంట్రాక్ట్​లు సరిగా చూడకపోవడం వల్ల రెండుసార్లు ఇలానే ఇబ్బందిపడ్డాను. ఇప్పుడిలా ఉన్నానంటే దానికి కారణం నా కృషితో పాటు ప్రేక్షకుల అంగీకారం కూడా ఉంది. నెపోటిజమ్​ గురించి నాకైతే తెలియదు. కానీ బాలీవుడ్​లో దాదాగిరి చాలా ఎక్కువగా ఉంది. నేను పెద్ద స్టార్​ను, నా అశీర్వాదం తీసుకోలేదు, నేను వచ్చినప్పుడు నువ్వు నిలబడలేదు లాంటి మాటలు చాలా వినిపిస్తుంటాయి"

-పియూష్ మిశ్రా, సీనియర్ నటుడు

తమ వారసులు వృద్ధి కోసం ఏ తల్లిదండ్రులైనా సరే ఆలోచిస్తారని పియూష్ అన్నారు. కానీ ఓ నటుడు కుమారుడు/కుమార్తె నటుడే కావాలని అనుకోవడం సరికాదని, వాళ్లకు రెడీమేడ్​ కెరీర్​ ఇవ్వడం పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అలా ఇండస్ట్రీకి వచ్చి, తమ తండ్రులపై ఉన్న అంచనాలు అందుకోలేక చతికిలపడిన నటీనటులు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. హిందీలోని 'మక్బూల్', 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్', 'పింక్' సినిమాలతో అలరించిన ఈయన తెలుగులో నాగార్జున 'సూపర్'లోనూ నటించారు.

ABOUT THE AUTHOR

...view details