తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా ఎఫెక్ట్​: బాలీవుడ్​కు రూ.వేల కోట్లు నష్టం! - cinema industry effected by corona

కొవిడ్-19 వల్ల చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. లాక్​డౌన్​ కారణంగా షూటింగులన్నీ ఆగిపోవడం వల్ల చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మరోవైపు సినిమాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిలిచిపోయి.. గడిచిన ఐదు నెలల్లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు నిపుణులు అంచనా వేశారు.

bollywood
బాలీవుడ్​

By

Published : Aug 11, 2020, 11:04 AM IST

ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా గడిపే దర్శకులు, నటీనటులు.. ప్రస్తుతం కొవిడ్​ భయాందళనల మధ్య ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారత్​తో పాటు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బాలీవుడ్​ పరిశ్రమ ఈ మహమ్మారి కుదుపునకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున షూటింగ్​, మార్కెటింగ్​, ప్రమోషన్​, పంపిణీ సహా సినిమాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా గడిచిన ఐదు నెలల్లో హీందీ పరిశ్రమ రూ. 2,500 నుంచి 3 వేల కోట్ల భారీ నష్టాలను భరించాల్సి వచ్చిందని మార్కెట్​ విశ్లేషకులు గిరీశ్​ జోహార్​ తెలిపారు. తాజాగా, ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

​ గిరీశ్​ జోహార్​,ట్రేడ్​ పండిట్​

మరోవైపు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మునపటి కంటే తక్కువ వ్యక్తులతో షూటింగ్​ జరపాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ క్రమంలోనే చిత్రసీమపై ఆధారపడి జీవిస్తున్న చాలా మంది జీవనోపాధిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని గిరీశ్​ పేర్కొన్నారు. ఫలితంగా సగం మంది కార్మికులు తమ ఉద్యోగాలను శాశ్వతంగా కోల్పోయారని అభిప్రాయపడ్డారు.

ఓటీటీవైపు అడుగులు

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 14 వేలకు పైగా థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా 2 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయినట్లు గిరీశ్​ పేర్కొన్నారు. మరోవైపు విడుదలకు నోచుకోని సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్​ఫామ్​ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలే పలు దేశాల్లో కొన్ని మార్గదర్శకాల ప్రకారం థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. దీంతో కార్మికులకు కాస్త ఉపశమనం కలిగినప్పటికీ.. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.

బిగ్​ సెలెబ్రెటీల సినిమాలు వాయిదా

ఓ వైపు నష్టపోయిన డబ్బును ఎలా తిరిగి పొందాలా అని బాలీవుడ్​ నిర్మాతలు ఆందోళన చెందుతుండగా.. మహమ్మారి వ్యాప్తి మధ్య చిత్రీకరణలంటేనే నటీనటులు భయపడుతున్నారు. కరోనా నివారణలో భాగంగా వ్యాక్సిన్​ కోసం ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. అది అందుబాటులోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది.

ఇలాంటి పరిస్థితుల్లో 'రాధే' తదుపరి షెడ్యూల్​ను సల్మాన్​ఖాన్​ స్వయంగా 2021 వరకు వాయిదా వేశాడు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్​, రణ్​వీర్​ సింగ్​లు నటిస్తున్న సినిమా షూటింగ్​లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, అక్షయ్​ కుమార్​, ఆమిర్​ ఖాన్​ మాత్రం ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని షూటింగులు ప్రారంభించారు.

సమస్యకు ముగింపు ఎప్పుడు.?

ఇప్పుడున్న పరిస్థితులన్నీ చక్కబడాలంటే మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని గిరీశ్​ అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల అనంతరం చిత్ర పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులతో పాటు నిరుద్యోగాన్ని ఎదుర్కొనే సూచనలున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే భారీ నష్టాల్లో కూరుకుపోయిన చిత్ర సీమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తక్షణ ఉపశమనం అవసరమని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details