తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bollywood News: 40 దాటిన నవయవ్వన హీరోలు - హీరోయిన్ ఫిట్​నెస్ సీక్రెట్స్

40-50 ఏళ్లు దాటితే శరీరంపై దృష్టి సారించడంలో చాలామంది అశ్రద్ధ చూపిస్తుంటారు. కానీ ఆ వయసులో బాడీని కంట్రోల్​లో ఎలా ఉంచుకోవచ్చో చెబుతున్నారు ఈ కథానాయకులు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారు?

BOLLYWOOD HEROS FITNESS SECRETS
హిందీ మూవీ న్యూస్

By

Published : Jul 24, 2021, 8:20 AM IST

'నలభై దాటితే జిమ్‌ గడప దాటాల్సిన పన్లేదు'.. 'ఫిట్‌నెస్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేయాల్సిందే'.. ఇదీ కొందరి అభిప్రాయం. ఈ భావన తప్పు అన్నది ఫిట్‌నెస్‌ గురూల మాట. సాక్ష్యం కావాలా? కండరగండడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లు అనిపించుకున్న ఈ ముదురు హీరోలను చూడండి. వాళ్లు చెప్పే ఫిట్‌నెస్‌ కిటుకులు పట్టేయండి.

హృతిక్‌ రోషన్‌ -47 ఏళ్లు

పాఠం: బాలీవుడ్‌లో తీరైన శరీరాకృతి అంటే ముందు గుర్తొచ్చేది హృతిక్‌ రోషనే. ఎప్పటికప్పుడు వర్కవుట్లు మార్చడం తన పద్ధతి. ఉదయం లేవగానే కార్డియో వ్యాయామాలు చేస్తాడు. సాయంత్రాలు స్ట్రెంగ్త్‌ వర్కవుట్లపై దృష్టి పెడతాడు. ఉదయం ఎండలో పదినిమిషాలైనా కసరత్తులు చేస్తాడట. దాంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహార నియమాలు తప్పడు. మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్‌ సమ్మిళిత ఆహారం తీసుకుంటాడు.

హృతిక్ రోషన్

ఫర్హాన్‌ అక్తర్‌ -47 ఏళ్లు

పాఠం: పాత్రకు తగ్గట్టు శరీరాన్ని ఎలాగైనా మలచుకోగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫర్హాన్‌. భాగ్‌ మిల్కా భాగ్‌, తూఫాన్‌ సినిమాల్లో టోన్డ్‌, సిక్స్‌ప్యాక్‌ బాడీలతో ఆకట్టుకున్నాడు. వీటికన్నా ముందు నుంచే అక్తర్‌ ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడు. కఠోర కసరత్తులు కాకపోయినా నడక, తేలికపాటి వ్యాయామాలు.. అతడి దినచర్యలో భాగం. ఇవి ప్రతి మనిషికీ అత్యవసరం అంటాడు.

ఫర్హాన్ అక్తర్

అక్షయ్‌ కుమార్‌ -53 ఏళ్లు

పాఠం: ఫిట్‌నెస్‌కు షార్ట్‌కట్‌లు ఉండవనేది అక్కీ మాట. రాత్రి తొమ్మిదికి ముందే నిద్రపోవడం, ఉదయం ఐదున్నరకే మేల్కొవడం అలవాటు. కాసేపు ఎండలో గడపడం, ఇంటి ఆహారాన్నే తీసుకోడం, క్రమం తప్పని వ్యాయామాలు తన దినచర్యలో భాగం. కండలు పెంచడం కన్నా ఫిట్‌గా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు.

అక్షయ్ కుమార్

జాన్‌ అబ్రహం -48 ఏళ్లు

సలహా: బాలీవుడ్‌లో పర్‌ఫెక్ట్‌ బాడీ నటుల్లో జాన్‌ ఒకడు. ఫిట్‌నెస్‌ను ఇష్టమైన ఆటగా భావిస్తాడు. ఒక్కరోజు కూడా తప్పడానికి ఇష్టపడడు. కార్డియో, స్ట్రెంగ్త్‌, బ్యాలెన్స్‌ వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాడు. వీటితోపాటు సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌ ఆడటం తప్పనిసరి.

జాన్ అబ్రహం

ఆమిర్‌ఖాన్‌ -56 ఏళ్లు

సలహా: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంలోనూ పర్‌ఫెక్టే. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని ఎలాగైనా మలిచేస్తాడు. బాడీకి తగినంత విశ్రాంతినిస్తే మనం చెప్పినట్టుగా వింటుంది అంటాడు. కఠినంగా శ్రమించడం, మంచి ఆహారం తీసుకోవడం.. ఈ రెండింటితో శరీరాన్ని శిల్పంలా చెక్కి, పదిలంగా కాపాడుకోవచ్చు అన్నది అతడి సలహా. ఓట్స్‌, గింజ ధాన్యాలు, ఫైబర్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం రోజుకు ఆరుసార్లు తీసుకుంటాడు. ఛెస్ట్‌, షోల్డర్‌ ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువ చేస్తుంటాడు.

ఆమిర్ ఖాన్

సైఫ్‌ అలీఖాన్‌ -50 ఏళ్లు

సలహా: యాభై ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ బాడీతో యువతకు మార్గదర్శిలా ఉండే హీరో సైఫ్‌. సుదూర నడకే తన ఫిట్‌నెస్‌ విజయరహస్యం అంటాడు. ట్రెడ్‌మిల్‌, కుదిరితే బయటికెళ్లి నడవడం.. ఏదైనా సరే రోజుకు ఐదారు కిలోమీటర్లు తప్పనిసరి. ఇదే కార్డియో అనీ, బరువు తగ్గడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి కారణం అంటాడు.

సైఫ్ అలీ ఖాన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details