టాలీవుడ్ బార్డర్లు దాటి పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ 'సాహో' స్టార్‌తో ఆడిపాడేందుకు బాలీవుడ్ హీరోయిన్లు కూడా క్యూ కడుతున్నారు. కొద్దిరోజుల్లో.. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనుంది. అందులో ప్రభాస్‌తో జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇంతవరకూ చిత్రబృందం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే!
ప్రభాస్‌కు జోడీగా ఆ బాలీవుడ్ భామ! - kgf director and bahubali star
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం 'సలార్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఎంపికైనట్లు సమాచారం.
కాగా.. 'బాహుబలి' స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు 'సలార్' టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ.. తెలుగు తెరకు పరిచయమైంది. అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఈమె నటించిన చిత్రాలు 'ఎంఎస్.ధోనీ', 'బాఘీ' ఈ ముద్దుగుమ్మకు మంచిపేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ఖాన్ సరసన 'రాధే', మరో హిందీ చిత్రంలోనూ నటిస్తోంది.
ఇదీ చూడండి:చిరుతో మోహన్‌బాబు.. మహేశ్‌కు పవన్ స్పెషల్ గిఫ్ట్