బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కొత్త చిత్రం 'పంగా'. ఇందులో కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనుందీ నటి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ఈ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
"నిజ జీవితాధారంగా చిత్రాలను తెరకెక్కించడంలో మా దర్శకురాలు అశ్వినీకి చాలా అనుభవం ఉంది. ఈ సినిమాలో నేను జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా కనిపిస్తా. 'పంగా' చిత్రంలో లాగే నాకూ నా కుటుంబమే సగం బలం, ధైర్యం. ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబమే ప్రధానం. వాళ్ల అండదండలు లేకుండా ఎవరూ రాణించలేరు. నా విషయానికొస్తే నా కుటుంబమే నా బలం.. బలహీనత. మా దర్శకురాలు అశ్వినీ తివారి, ఆమె భర్త నితీష్‌ల మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. అందుకే వాళ్లను చూసిన తరువాత నేను కూడా ఓ ఇంటిదాన్ని కావాలనిపిస్తోంది."
-కంగనా రనౌత్, బాలీవుడ్ స్టార్ కథానాయిక