తెలంగాణ

telangana

ETV Bharat / sitara

25వేల మంది కార్మికులకు అండగా సల్మాన్​ఖాన్​ - BOLLYWOOD HERO SALMANKHAN IS GIVING FINANCIAL HELP TO 25000 PEOPLE IN THE CINE FIELD

లాక్​డౌన్​ వల్ల సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేతన కార్మికులకు అండగా నిలిచాడు హీరో సల్మాన్​ఖాన్. 25 వేల మందికి ఆర్థిక సాయమందించనున్నట్లు చెప్పాడు.

SALMAN KHAN
25వేల మందికి ఆర్థిక అండగా సల్మాన్​ఖాన్​

By

Published : Mar 30, 2020, 10:10 AM IST

బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ఖాన్‌ దాతృత్వన్ని చాటుకున్నాడు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించారు. ఫలితంగా సినీ పరిశ్రమలో షూటింగ్స్‌ నిలిచిపోయాయి. వీటినే జీవనాధారంగా చేసుకుని బతుకు సాగిస్తున్న ఎందరో రోజువారీ వేతన కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వారి సంక్షేమం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ తన వంతు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చాడని 'ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయిస్‌' ప్రెసిడెంట్ బీఎన్‌ తివారీ చెప్పారు.

ఖాతాల ద్వారా

రోజువారీ కార్మికులకు సాయం చేయడానికి సల్మాన్‌కు చెందిన బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చిందని తివారీ చెప్పారు. ఆ సంస్థకు చెందినవారు మూడు రోజుల క్రితం తమను కలిశారని అన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయిస్‌లో ఐదు లక్షల మంది ఉండగా.. అందులో 25 వేలమంది కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ 25 వేల మంది బాగోగులను ఆ సంస్థ సభ్యులే చూసుకుంటామని చెప్పారు. కార్మికుల ఖాతాల్లోనే డబ్బులను నేరుగా జమ చేసేందుకు వీలుగా 25 వేల మందికి సంబంధించిన ఖాతా వివరాలను అడిగి తీసుకున్నారని ఎఫ్​డబ్ల్యూఐసీఈ ఛైర్మన్​ తెలిపారు.

ఇదీ చదవండి:పన్నెండు పరాజయాలెదురైనా పట్టువదలని 'భీష్మ'

ABOUT THE AUTHOR

...view details