తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సింగ్​ లుక్కులో అదరిపోయిన ఆమిర్​ఖాన్​ - తెలుగు అమిర్​ ఖాన్​ సినిమా వార్తలు

బాలీవుడ్​ హీరో ఆమిర్​ఖాన్​ హీరోగా నటిస్తున్న 'లాల్​ సింగ్ చద్దా' చిత్రం ఫస్ట్​లుక్​ విడుదలైంది. హాలీవుడ్​ సినిమా 'ఫారెస్ట్​ గంప్'​కు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సింగ్​ లుక్కులో అదరిపోయిన ఆమిర్​ఖాన్​

By

Published : Nov 18, 2019, 12:31 PM IST

'దంగల్' సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు, ఇతర దేశాల్లోనూ గొప్ప గుర్తింపు పొందిన కథానాయకుడు ఆమిర్​ఖాన్. తాజాగా ఈ బాలీవుడ్ నటుడు నటిస్తోన్న చిత్రం 'లాల్​ సింగ్ చద్దా'. ఈ సినిమా ఫస్ట్​ లుక్​ ఈ రోజు విడుదలైంది. సింగ్ లుక్కులో ఆమిర్ ఆకట్టుకుంటున్నాడు.

వయాకామ్ 18 మోషన్​ పిక్చర్స్​, ఆమిర్​​ఖాన్​ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యువకుడి పాత్ర కోసం ఆమిర్​ 20కిలోలు తగ్గారట. ఇందులో బాలీవుడ్ ఖాన్​ త్రయం... ఆమిర్​, షారుఖ్​, సల్మాన్ కలిసి నటించనున్నారని బాలీవుడ్​ మీడియా సమాచారం.

అద్వైత్​ చందన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపుర్​ కథానాయిక. వచ్చే ఏడాది క్రిస్మస్​కు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ​

1994లో హాలీవుడ్​లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్​' సినిమా రీమేక్​గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. అమెరికన్​ ప్రముఖ నటుడు టామ్​ హ్యాంక్స్​ ఈ సినిమాలో నటించి మెప్పించాడు.

సింగ్​ లుక్కులో అదరిపోయిన ఆమిర్​ఖాన్​

ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్‌ గాయనుల సందడి

ABOUT THE AUTHOR

...view details