బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.. మరోసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు పురోహితులు, డోలు కళాకారులతో పాటు పార్క్ అధికారులు అజయ్ దేవగణ్‌కు ఘన స్వాగతం పలికారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్ దేవగణ్ - అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్
ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవగణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈయనతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్ దేవగణ్
ప్రస్తుతం 'మేడే', 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నారు అజయ్ దేవగణ్. 'మేడే' సినిమాకు దర్శకత్వం వహిస్తూ అందులో అమితాబ్‌తో కలిసి నటిస్తున్నారు.
ఇవీ చదవండి: