తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేక్షకులను మాయ చేసిన సినీ 'నకిలీ' బాబాలు - fake Godmen latest news

క్రైమ్, సస్పెన్స్​, కామెడీ, డ్రామా​.. ఇవే వెబ్​సిరీస్​లను ఏలుతున్న పదాలు. మరి నకిలీ బాబాలకు ఆ కథలతో లింక్​ పెడితే ఎలా ఉంటుంది? అదే ఫార్ములాతో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, సిరీస్​లు వస్తున్నాయి. వెండితెర నుంచి ఓటీటీ వరకూ విడుదలైన ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులూ బ్రహ్మరథం పడుతున్నారు. వాటిల్లో హైలెట్​గా నిలిచిన కొన్నింటి విశేషాలు మీకోసం.

Bollywood films that exposed fake Godmen
గాడ్​మెన్​ న్యూస్​

By

Published : Nov 19, 2020, 5:46 PM IST

ఓటీటీల్లో అందుబాటులో ఉన్న వెబ్‌ సిరీస్‌లకు కొంతకాలంగా విశేష ఆదరణ లభిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాటిని చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఇప్పడు నకిలీ బాబాల ఫార్ములా ట్రెండింగ్​గా మారింది. ఈ మధ్య కాలంలో విడుదలైన 'ఆశ్రమ్'​ అలరించడం వల్ల దర్శకనిర్మాతలు రెండో భాగాన్ని కూడా విడుదల చేశారు. బాబీ దేఓల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు.. ప్రకాష్‌ ఝా దర్శకుడు.

అన్ని రంగాలను శాసించే బాబా నిరాలా ఆఫ్‌ కాశీపూర్‌ పాత్రలో బాబీ దేఓల్‌ కనిపించారు. తొలిసారి ఆయన వెబ్‌సిరీస్‌లో నటించారు. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? లాంటి విషయాలను ఆసక్తికరంగా రూపొందించారు. అయితే ఇలాంటి కథలను యథార్థ సంఘటనల ఆధారంగా తెరక్కిస్తుండటం విశేషం. ఆశారాం బాపు, బాబా రామ్​ రహీం వంటి నకిలీ బాబాలే సదరు దర్శకులకు ఉదాహరణలుగా నిలుస్తున్నారు. అందుకే ఈ కథాంశాలతో సినిమాలు బాలీవుడ్​లో తెగ సందడి చేస్తున్నాయి. వినోదాన్ని పంచుతూనే డ్రామా రూపంలోనూ ఇవి తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన పలు నకిలీ బాబాల చిత్రాల విశేషాలు మీకోసం.

జాదూగర్​..

1980లో కామెడీ థ్రిల్లర్​ వచ్చిన సినిమా 'జాదూగర్'​. ప్రకాశ్​ మెహ్రా దర్శకత్వం వహించగా, అమితాబ్​ బచ్చన్​, జయప్రద, ఆదిత్య పంచోలి, అమృతా సింగ్​, ప్రాణ్​, అమ్రిష్​ పురి తదితరులు నటించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద కాస్త నిరాశపర్చింది. అయితే ఇందులో అమ్రిష్​ పురి పాత్ర మాత్రం వీక్షకులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఆయన నకిలీ తాంత్రిక మహాప్రభు జగత్​సాగర్​ చింతమనేని పాత్రలో మెప్పించారు. క్లైమాక్స్​లో బాబా గుట్టువిప్పే వ్యక్తి గోగ పాత్రలో అమితాబ్​ కనువిందు చేశారు.

అమ్రిష్​ పురి

బుద్ధ మర్​ గయా..

రాహుల్​ రావిల్​ దర్శకత్వం వహించిన 'బుద్ధ మర్​ గయా' 2007లో విడుదలైంది. అనుపమ్​ ఖేర్​, ఓం​ పురి, పరేష్​ రావల్​ కీలకపాత్రలు పోషించారు. దురాశపరుడైన బాబా పాత్రలో ఓం పురి ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్​ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది ఈ సినిమా. ఓం పురి పాత్ర మాత్రం చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

ఓం పురి

ఓ మై గాడ్​..

2012లో విడుదలైన 'ఓ మై గాడ్'​.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్షయ్​ కుమార్​, పరేశ్​ రావల్​ కలిసి నటించిన ఈ సినిమాలో.. దేవుడిపైనే ఓ న్యాయవాది దావా వేయడం లాంటి కథాంశం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దేవుడిగా ప్రకటించుకున్న మోసపూరిత బాబా లీలలను తెరపై అద్భుతంగా చూపించారు. లీలాధర్​ మహారాజ్​ పాత్రలో మిథున్​ చక్రవర్తి నటన అదరహో అనిపించింది. దేవుడి పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే వ్యక్తిగా ఆయనను చూపించారు. వ్యంగ్యంగా సమాజంలో దొంగ బాబాల సంస్కృతిని బహిర్గతం చేసిందీ సినిమా.

మిథున్​

పీకే..

పీకే అనేది కల్ట్​ కేటగిరీకి చెందిన చిత్రం. రాజ్​కుమార్​ హిరాణీ తెరకెక్కించిన ఈ మాస్టర్​ పీస్​ వీక్షకులను మెప్పించింది. స్వీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే బాబా గురించి ఈ చిత్రంలో చూపించారు. తపస్వి మహారాజ్​ పాత్రలో నటుడు సౌరభ్​ శుక్లా ఒదిగిపోయారు. నకిలీ బాబా, వారిని గుడ్డిగా అనుసరించే వ్యక్తుల గురించి ఈ చిత్రంలో వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తూనే సందేశమిచ్చారు.

సౌరభ్​ శుక్లా

సింగమ్​ రిటర్న్స్​

రోహిత్​ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సింగమ్​ రిటర్న్స్​' 2014లో థియేటర్లలోకి వచ్చింది. ఇందులో అమోల్​ గుప్తా స్వామీజి పాత్రలో కనిపించారు. మోసపూరిత బాబాల గురించి చెప్తూనే.. అతడికి మాఫియాలతో ఉన్న సంబంధాలను బహిర్గతం చేశారు. అక్రమ ఆయుధాల రవాణా, మందుగుండు సామగ్రి సరఫరా, అవినీతి రాజకీయ నాయకులతో కలిసి బాబా చేసిన పనుల్ని ఆసక్తికరంగా చూపించారు. రాజకీయల్లోనూ బాబా జోక్యాన్ని చక్కగా వివరించారు దర్శకుడు. క్లైమాక్స్​లో 'సింగం' అజయ్​ దేవగణ్​.. బాబా గుట్టును ఎలా బయటపెట్టాడు అనేది వీక్షకులను మరింత ఆకట్టుకుంది.

అమోల్​ గుప్తా

చల్​ గురూ హో జా షురూ

ఈ సినిమాలో నకిలీ బాబాల గురించి చెప్తూనే వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. ఇబ్బందుల్లో ఉన్న నటులు త్వరగా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో బాబాలుగా ఎలా మారారు? నకిలీ స్వామిజీలు ఎలా పుట్టుకొస్తున్నారు? అనేది అర్థవంతంగా చూపించారు. హేమంత్​ పాండే, చంద్రచూర్​ సింగ్​, సంజయ్​ మిశ్రా, మనోజ్​ పాహ్వా లాంటి నటులు తమ ప్రదర్శనతో మెప్పించారు. కామెడీ టైమింగ్​తో అలరించారు.

చల్​ గురూ హో జా షురూలో ఓ సన్నివేశం

గ్లోబల్​ బాబా

దర్శకుడు మనోజ్​ తివారి తీసిన 'గ్లోబల్​ బాబా' 2016లో విడుదలైంది. అభిమన్యు సింగ్​ ప్రధాన పాత్రలో కనువిందు చేశారు. నేరస్థుడు ఏ విధంగా పోలీసుల నుంచి తప్పించుకోడానికి స్వామిజీగా మారాడు? అనేది ఇందులో చక్కగా చూపించారు. పోలీసులు, ప్రజాప్రతినిధులను ఫాలోవర్లుగా మార్చుకునేంతగా బాబా ఎలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు? అనేది ఇందులో అద్భుతంగా చెప్పారు. బాబా మోసాలు, నేర ప్రవృత్తిని బహిర్గతం చేసేలా ఈ సెటైరికల్​ సినిమా ఉంటుంది.

అభిమన్యు సింగ్​

సడక్​ 2

ఈ ఏడాది విడుదలైన సడక్​2 చిత్రానికి భారీగా నెగిటివ్​ రివ్యూలు వచ్చాయి. అయితే ఇందులో వ్యతిరేక ఛాయలున్న పాత్రలో నటించారు మకరంద్​ దేశ్​ పాండే. ఆయన జ్ఞాన్​ ప్రకాశ్​ పాత్రలో కనువిందు చేశారు. ఆర్య పాత్ర పోషించిన ఆలియా భట్ తన తల్లి మరణానికి.. జ్ఞాన్ ప్రకాశ్​ కారణమని నమ్ముతుంది. నకిలీ గాడ్‌మన్‌ల గురించి చెప్పడానికి ఆమె ఆన్​లైన్​ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. దీనిని వినూత్నంగా చూపించారు.

మక్రండ్​ దేశ్​ పాండే

ABOUT THE AUTHOR

...view details