చిత్రీకరణ సమయంలో టేకుల మీద టేకులు తీసకుంటారు దర్శకులు. ఒక సన్నివేశం తాను అనుకున్న విధంగా వచ్చే వరకూ పాత్రధారులతో నటింపజేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకులు రెండుమూడు టేకులతో సరిపెట్టేస్తుంటారు. అవి సాధారణంగా బెడ్ రూమ్ దృశ్యాలు, ముద్దు సన్నివేశాల్లాంటివి అయి ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ మాత్రం తాను ఏ దశలోనూ రాజీపడను అన్నట్లు ఓ ముద్దు సన్నివేశాన్ని తీశారు.
ముద్దు కోసం హీరోహీరోయిన్ 37 టేకులు - కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి సినిమా
బాలీవుడ్లో ఓ సినిమాలోని ముద్దు సన్నివేశం కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నారు. దీని వెనుకున్న కథేంటి? అసలు ఎందుకు ఇన్నిసార్లు ఈ సీన్ చేయాల్సి వచ్చింది?
హీరో, హీరోయిన్.. ఒక ముద్దు.. 37.. టేకులు
సుభాష్ ఘయ్ 'కాంచి' చిత్రాన్ని తీశారు. కార్తిక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లు. వీరిద్దరిపై ఓ చుంబన దృశ్యాన్ని చిత్రీకరించారు. ఆ నటీనటులు ముద్దు విషయంలో కాస్త బిడియపడ్డారట. ఆ తత్తరపాటులో సరిగా రాలేదని భావించి కట్ చెప్పేసి, మళ్లీ ముద్దుపెట్టుకోమన్నారట. అలా కార్తిక్, మిస్తీలు మొత్తం 37 టేకులు తీసుకున్న తర్వాత గానీ సుభాష్ అనుకున్న విధంగా సీన్ రాలేదట. అంతసేపు ముద్దులాట చూసి చిత్రీకరణ బృందం రకరకాల జోకులు వేసుకున్నారట.
ఇదీ చూడండి: