తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రికెట్​-సినిమా మధ్య 'ప్రేమాయణం' సాగిందిలా! - cricketers love affairs

హీరో హీరోయిన్ల మధ్య కంటే.. క్రికెటర్స్, కథానాయికల మధ్యే ఎఫైర్స్ ఎక్కువగా సాగుతుంటాయి! ఇప్పటివరకు ఎందరో ముద్దుగుమ్మలు.. క్రికెటర్లతో ప్రేమలో మునిగితేలి వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారెవరు? ఎవరెవరిని ప్రేమించారు?

Bollywood-cricket love stories that vanished in thin air
క్రికెట్​-సినిమా మధ్య 'ప్రేమాయణం' సాగిందిలా!

By

Published : Feb 14, 2021, 1:13 PM IST

సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలది విడదీయరాని బంధం. ఈ రెండింటికి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంటోంది. అందుకే వీటికి సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్రికెటర్స్​ హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఉంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఈనాటిదికాదు.. నాటి ఇమ్రాన్​ ఖాన్​- దీవా జీనత్​, కపిల్​దేవ్​-సారికా నుంచి నేటి విరాట్ కోహ్లీ-అనుష్క‌శ‌ర్మ వరకు ఎంద‌రో క్రికెట‌ర్లు హీరోయిన్ల‌ు మధ్య ప్రేమకథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు మధ్యలోనే బ్రేకప్ అవ్వడం.. కొన్ని అవి నిజం కాదని తేలడం, మరికొన్ని పెళ్లి పీటలు వరకు వెళ్లడం జరిగాయి. ఇప్పటివరకు మన స్టార్​ క్రికెటర్లు, హీరోయిన్స్​ మధ్య చిగురించినట్లు తెలిసిన ప్రేమ కథల సమాహారమే ఈ కథనం.

ఇమ్రాన్​ ఖాన్​- దివా జీనత్

ఇమ్రాన్​ ఖాన్​- దివా జీనత్

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ ఇమ్రాన్​ ఖాన్​ బాలీవుడ్​ సీనియర్​ నటి దివా జీనత్​తో​ రిలేషిన్​షిప్​లో ఉన్నట్లు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఎక్కడ చూసిన ఈ జంట కనిపించేవారు. వీరి గురించి అనేక కథనాలు ప్రచరితమయ్యేవి. కానీ ఆ తర్వాత జీనత్​, మజ్హర్​ను పెళ్లి చేసుకోగా.. ఇమ్రాన్​, బ్రిటీష్​ బిలీయనీర్ హైరెస్​ జెమిమా గోల్డ్​స్మిత్​ను నిఖా చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

వీవ్‌ రిచర్డ్స్‌​-నీనా గుప్తా

వీవ్‌ రిచర్డ్స్‌​-నీనా గుప్తా

వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌ వీవ్‌ రిచర్డ్స్‌, సీనియర్​ నటి నీనా గుప్తా అప్పట్లో కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నీనా, వీవ్‌ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడం వల్ల సమాజంలో తనపై ప్రతికూల ప్రభావం పడిందని నీనా ఓ సందర్భంలో చెప్పింది. ఈమె చివరగా బాలీవుడ్ 'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావ్‌ధాన్‌' సినిమాలో నటించింది.

కపిల్​దేవ్-​ సారికా

కపిల్​దేవ్-​ సారికా

భారత దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​ పెళ్లికి ముందు సీనియర్ నటి సారికతో ప్రేమాయణం నడిపాడు. ఎక్కడ చూసిన ఈ జంట తెగ కనపడేవారు. అనంతరం కొన్ని కారణాల వల్ల విడిపోయి కపిల్​.. రోమి భాటియాను, సారిక స్టార్​ నటుడు కమల్​ హాసన్​ను పెళ్లి చేసుకున్నారు.

మహ్మద్​ అజాహరుద్దీన్​- సంగీత బిజ్లానీ

మహ్మద్​ అజారుద్దీన్​- సంగీత బిజ్లానీ

భారత మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజాహరుద్దీన్​.. బాలీవుడ్​ నటి, మిస్ ​ఇండియా విజేత సంగీత బిజ్లానీ.. తాము ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నామని గతంలో బహిరంగంగానే ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

మోహ్సిన్​ ఖాన్-​ రీనా రాయ్​

మోహ్సిన్​ ఖాన్-​ రీనా రాయ్​

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​, బాలీవుడ్​ సీనియర్​ నటి రీనా రాయ్.. పీకల లోతుగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ పుట్టాక మనస్పర్థల కారణంగా విడిపోయారు.

రవిశాస్త్రి-అమ్రితా సింగ్​

రవిశాస్త్రి-అమ్రితా సింగ్​

భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, నటి అమ్రితా సింగ్​ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరికి 1986లో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ 1990లో రీతూను రవిశాస్త్రి పెళ్లి చేసుకోగా.. అమ్రితా, నటుడు సైఫ్​ అలీఖాన్​తో ప్రేమలో పడింది.

గంగూలీ-నగ్మా

నగ్మా, సౌరవ్​ గంగూలీ

క్రికెటర్స్​ ఎఫైర్స్​లో హాట్​ టాపిక్​ అంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ క్రికెటర్​, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సీనియర్​ నటి నగ్మా. ఎన్నో వివాదాలకు దారీ తీసింది వీరి ప్రేమకథ. అప్పటికే దాదా డోనా రాయ్​ను వివాహం కూడా చేసుకున్నాడు. దీంతో ఆమె గంగూలీకి విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ తర్వాత నగ్మా-గంగూలీ విడిపోయాక ఈ వివాదం పరిష్కారమైంది!

అజయ్​ జడేజా-మాధురి దీక్షిత్​

అజయ్​ జడేజా-మాధురి దీక్షిత్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ అజయ్​ జడేజా, సీనియర్​ హీరోయిన్​ మాధురి దీక్షిత్​ గురించి కార్చిచ్చు అంటుకున్నంత వేగంగా పుకార్లు వచ్చేవి. మరి ఇది ఎంతవరకు నిజమో వారికే తెలియాలి.

వసీం అక్రమ్​-సుస్మితా సేన్​

వసీం అక్రమ్​-సుస్మితా సేన్​

మాజీ మిస్​ యూనివర్స్​, బాలీవుడ్​ నటి సుస్మితా సేన్​ పాకిస్థాన్​ క్రికెటర్​ వసీం అక్రమ్​.. గతంలో ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు.

కిమ్​ శర్మ-యువరాజ్​సింగ్- దీపికాపదుకొణె

యువరాజ్​, దీపికా పదుకొణె

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ ఒకరి తర్వాత మరొకరితో వరుసగా ప్రేమయాణం నడిపినట్లు వార్తలు బాగా వచ్చాయి. వారిలో స్టార్ హీరోయిన్​​ దీపికా పదుకొణె, నటి కిమ్​ శర్మ ఉన్నారు.

యువరాజ్​, కిమ్​శర్మ

జహీర్​ ఖాన్​- ఇషా షవ్రానీ

జహీర్​ ఖాన్​- ఇషా షవ్రానీ

టీమ్​ఇండియా మాజీ​ బౌలర్​ జహీర్​ ఖాన్​, నటి ఇషా షవ్రానీ దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అనంతరం విడిపోయి వేరు వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు.

రోహిత్​ శర్మ- సోఫియా హయత్​

రోహిత్​ శర్మ- సోఫియా హయత్​

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​శర్మ, మోడల్​ సోఫియా హయత్​ అప్పట్లో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ దీనిపై హిట్​మ్యాన్​ ఎప్పుడు నోరు విప్పలేదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో సోఫియా.. తామిద్దరు విడిపోయినట్లు బహిరంగంగానే తెలిపింది.

దీపికా-ధోనీ- రాయ్​లక్ష్మీ

దీపికా-ధోనీ

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ కెరీర్​ మంచి ఫామ్​లో ఉన్నప్పుడు చాలా ప్రేమాయణాలు నడిపినట్లు వదంతులు వచ్చాయి. 2007లో స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె, 2009లో నటి రాయ్​ లక్ష్మీతో ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం మహీ.. తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ఓ పాప కూడా జన్మించింది.

ధోనీ- రాయ్​లక్ష్మీ

ఇదీ చూడండి:సినిమాల్లో అలరించి.. బిజినెస్​మ్యాన్​ను పెళ్లాడి!

ABOUT THE AUTHOR

...view details