సినిమా స్టార్స్ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు వేసుకునే బట్టలు, తినే తిండి, ఉండే ఇళ్లు, తిరిగే కార్లు.. ప్రతీది హైక్లాస్గానే ఉంటాయి! ప్రతి విషయంలోనూ ఏ మాత్రం రాజీపడకుండా తమ అభిరుచికి తగ్గట్లుగా ఉండేలా చూసుకుంటుంటారు.
నిత్యం సినిమాలు చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్న ఈ నటీనటులకు.. వారి విలాసాలకు అయ్యే ఖర్చు పెద్ద విషయంఏమీ కాదు!. అయితే కొంతమంది నటులు మాత్రం భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఇంకా అద్దె ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకు వారు ఎక్కువగానే డబ్లులు చెల్లిస్తున్నారు. అలాంటి స్టార్స్ గురించే ఈ స్టోరీ.
రిచాచద్ధా-అలీ ఫజల్(Richachaddha-Ali Fazal)
బాలీవుడ్ ప్రేమ జంట రిచాచద్ధా-అలీ ఫజల్. 'ఫక్రే' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. గతేడాది ఓ కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు. దీని అద్దె నెలకు రూ.3లక్షలు. ఈ మధ్య కాలంలో వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్ పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రిచా. ప్రస్తుతం 'అభి తో పార్టీ షురూ హుయి హై' సినిమాలో నటిస్తోంది. అలీ ఫజల్.. ఇటీవల 'మీర్జాపూర్ 2'తో అలరించాడు. త్వరలోనే 'డెత్ ఆన్ ది నైల్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సన్నీలియోనీ(SunnyLeone)
బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోని కెరీర్ ప్రారంభంలో, సహనటి సెలీనా జైట్లీ పెంట్ హౌస్‌లో తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఉండేదట. ఆ తర్వాత అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలోని స్పిల్ట్విల్లాకు మారింది.
కత్రినా కైఫ్(Katrina Kaif)
బాలీవుడ్ బార్బీ గర్ల్ కత్రినా కైఫ్ కొద్దికాలం క్రితం వరకు ఓ ప్లాట్‌కు ఏకంగా రూ.15 లక్షలు అద్దె కట్టి ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె ముంబయి బాంద్రాలోని ఓ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటోంది. త్వరలోనే 'సూర్యవంశీ', 'ఫోన్ భూత్', 'టైగర్ 3' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.