తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"మీ తెగువకు సలాం" - amitab

పాక్ చెర నుంచి విడుదలైన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ రాక పట్ల బాలీవుడ్ తారలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

షారూక్ ఖాన్, రణ్ వీర్ సింగ్, అమితాబ్

By

Published : Mar 2, 2019, 11:14 AM IST

భారత వింగ్ కమాండర్ అభినందన్​కు సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్ తారలు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల అనంతరం పాక్ చెర నుంచి భారత్​లో

అడుగుపెట్టిన అభినందన్​ను షారూక్, అమితాబ్​తో సహా పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

"స్వదేశానికి రావడం కంటే గొప్ప అనుభూతి ఏమీ ఉండదు, మాతృభూమి ప్రేమ, ఆశ, కలలకు చిరునామా" అంటూ షారూక్ ట్వీట్ చేశాడు

"అభినందన్ రాక సంతోషాన్ని కలిగించింది" అని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ చెప్పుకొచ్చారు.

"మీరు చూపిన ధైర్యం, శౌర్యానికి సెల్యూట్" అంటూ కరణ్ జోహర్ ట్వీట్​ చేశాడు.

"అభినందన్ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.. దేశం మొత్తం మరిచిపోలేని సంఘటన ఇది" అని రణ్​వీర్ సింగ్ ట్వీట్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details