మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బాలీవుడ్ తారాగణం ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యతను చాటుకున్నారు. ప్రజలందరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.
అమితాబ్ కుటుబం
అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్... జుహూలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
షారుక్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, తన భార్య గౌరీతో కలిసి ముంబయి బాంద్రా (పశ్చిమ)లోని 177వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
షబానా అజ్మీ- జావేద్ అక్తర్
అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ.. ముంబయిలో ఓటు వేశారు. ఆమె వెంట ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఉన్నారు.