బాలీవుడ్లో కరోనా.. అసలేం జరుగుతోంది?
బిగ్‌బీ అమితాబ్ కుటుంబానికి కరోనా సోకడం కలకలం రేపింది. వీరితో పాటే మరికొందరు స్టార్స్ కొవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖ నటీనటులకు వైరస్ సోకినట్లు అసత్య వార్తలనూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
అమితాబ్ కుటుంబం
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. వీరిలో ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సినీ ప్రముఖులకు వైరస్ సోకిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. వీటిపైన స్పందిస్తున్న సదరు స్టార్స్.. ఆ విషయమై వివరణ ఇస్తున్నారు.
- శనివారం రాత్రి తనకు కరోనా సోకినట్లు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అనంతరం ఆయన కుమారుడు అభిషేక్‌కు పాజిటివ్‌గా తేలింది. -'బిగ్ బీ, అభిషేక్‌కు కరోనా- ఆసుపత్రికి తరలింపు'
- వీరితో పాటే బిగ్‌బీ సతీమణి జయా బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలకు పరీక్షలు చేయగా, నెగిటివ్ వచ్చినట్లు ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ ఆదివారం ఉదయం వెల్లడించారు.
- ఐశ్వర్యతో పాటు ఆమె కుమార్తె వైరస్ బారినపడ్డట్లు మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే.. ఆదివారం మధ్యాహ్నం ట్విట్టర్లో పంచుకుని, వెంటనే దానిని డిలీట్ చేసేశారు. - 'ఐశ్వర్యా రాయ్‌తో పాటు ఆమె కుమార్తెకు కరోనా'
- బిగ్‌బీ అమితాబ్ కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, క్రీడాప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాన ఆలయాల్లో అభిమానులు.. పూజలు, హోమాలు సైతం చేయిస్తున్నారు. -'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్'
- అమితాబ్ ఇంటి దగ్గర శానిటైజేషన్ చేసి, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. బిగ్‌బీ ఇంటిని సీల్ కూడా చేసింది. -కంటైన్మెంట్ జోన్‌గా అమితాబ్ బచ్చన్ ఇంటి పరిసరాలు
- సీనియర్ నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడం వల్ల ఆమె బంగ్లాకు అధికారులు సీల్ వేశారు. -నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.. బంగ్లా మూసివేత
- బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లితో పాటు ఇతడి సోదరుడి ఇంట్లో ముగ్గురికి కరోనా సోకింది. అనుపమ్‌కు మాత్రం నెగిటివ్‌గా తేలింది. -అనుపమ్ ఖేర్ తల్లితో పాటు సోదరుడి కుటుంబానికి కరోనా
- తనకూ ప్రాణాంతక కరోనా సోకిందని ధ్రువీకరించింది ముంబయికి చెందిన మోడల్, నటి రేచల్ వైట్. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు స్పష్టం చేసింది.
- రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఆమె తల్లి నీతూ కపూర్‌కు కరోనా సోకిందనే వార్తలపై స్పందించిన రణ్‌బీర్ రిద్దిమా కపూర్.. తాము ఆరోగ్యంగానే ఉన్నామని తెలిపింది. అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది. -'రణ్‌బీర్, హేమమాలినికి కరోనా లేదు.. పుకార్లు ఆపండి'
- బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమనేది నిరధారమైన వార్త అని కొట్టి పారేసింది ఆమె కుమార్తె ఇషా దేఓల్.
- బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఆమిర్‌ఖాన్, కరణ్ జోహర్, బోనీ కపూర్లు తమ సిబ్బందికి వైరస్ సోకినట్లు ఇటీవలే వెల్లడించారు.