కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటం వల్ల చాలా రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్కూ ఈ ప్రభావం గట్టిగానే తగిలింది. ప్రస్తుతం థియేటర్లు మూతపడటం, చిత్రీకరణలు నిలిచిపోవడం వల్ల సందడిగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయాయి. సినీ పరిశ్రమలో రోజువారీ కూలీలు చేతులో డబ్బుల్లేక సతమతమవుతున్నారు.
"మేం ఇక్కడ రోజువారీ కూలీలం. ఈనెల చివరి వరకు పనులన్నీ నిలిపివేయడం వల్ల ఆదాయాన్ని కోల్పోయాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. తిరిగి పనులు ఎప్పుడు మొదలవుతాయో అర్థం కావడం లేదు. రైళ్లు తిరగకపోవడం వల్ల ఇంటికెళ్లాలన్నా కష్టమే" -దీపక్ గౌర్, రోజువారీ కూలీ
చిత్రీకరణలు నిలిచిపోవడం వల్ల నటీనటులు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలలు వాయిదా పడ్డాయి. అవి మళ్లీ ఎప్పుడు వస్తాయనేది ఇంకా తెలియదని సినీ జర్నలిస్టు సోహెల్ ఫిదాయ్ అన్నారు.