బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ భాగ్యనగరంలో ల్యాండ్ అయింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ మూవీలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది ఆలియా.
హైదరాబాద్‌కు ఆలియా.. 'ఆర్ఆర్ఆర్' షూట్‌కు రెడీ - ఆర్ఆర్ఆర్ షూట్లో ఆలియా భట్
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ హైదరాబాద్ విచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది.`
ప్రస్తుతం ఆలియాభట్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఓ పాట రూపొందించనున్నారు శరవేగంగా ఆ పాట చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరీస్, కీలకపాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది.